Begin typing your search above and press return to search.

చిరుతో మాటల మాంత్రికుడి స్కెచ్!

By:  Tupaki Desk   |   28 Nov 2018 1:28 PM IST
చిరుతో మాటల మాంత్రికుడి స్కెచ్!
X
చిన్న మాటల్లోనే పెద్ద పంచులు విసురుతూ అటు హాస్యాన్ని ఇటు సెంటిమెంట్ ని సమపాళ్లలో బాలన్స్ చేయగలిగిన రచయితగా దర్శకుడిగా టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థానం చాలా ప్రత్యేకం. ఒకటిఅరా పరాజయాలు ఉన్నప్పటికీ ఆయనకు ప్రత్యేకమైన అభిమాన గణం కోట్లలో ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం కథను వండే పనిలో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఆ తర్వాత మెగా స్టార్ చిరంజీవితో చేయబోతున్నట్టు తాజా సమాచారం. ఇది అఫీషియల్ అప్ డేట్ కాదు కానీ వస్తున్న టాక్ ప్రకారం బన్నీతో త్రివిక్రమ్ కొరటాలతో చిరు తమ తమ ప్రాజెక్ట్స్ పూర్తి చేసాక దీనికి వస్తారని అంటున్నారు.

మరీ ఎక్కువ మసాలాలు లేకుండా కామెడీతో పాటు ఎమోషన్స్ ని బాలన్స్ చేసేలా అత్తారింటికి దారేది టైపు లో ఎంటర్ టైనర్ తీయాలనేదే త్రివిక్రమ్ కోరికట. చిరుని కలిసిన ప్రతిసారి ఈ మాట ప్రస్తావించిన త్రివిక్రమ్ ఇటీవలే గట్టి మాటే తీసుకున్నాడని తెలిసింది. అయితే త్రివిక్రమ్ మాటలు చిరు పలకడం ఇది మొదటిసారి కాదు. 2005లో వచ్చిన జై చిరంజీవకు సంభాషణలు సమకూర్చింది త్రివిక్రమే. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విజయం సాధించకపోయినా చిరు చేసిన కామెడీ వన్ లైనర్స్ బాగా పాపులర్ అయ్యాయి.

ఇప్పుడు తానే కెప్టెన్ గా చిరు తో సినిమా అంటే త్రివిక్రమ్ ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకుంటాడని వేరే చెప్పాలా. వరసగా క్రేజీ ప్రాజెక్ట్ లన్ని తన ఖాతాలో వేసుకుంటున్న డివివి దానయ్య దీనికి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. కాకపోతే ఇది కార్యరూపం దాల్చడానికి బాగా టైం పట్టొచ్చు.