Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ ఇక మెగా పవర్ స్టార్ తో??

By:  Tupaki Desk   |   7 Jun 2016 7:21 PM IST
త్రివిక్రమ్ ఇక మెగా పవర్ స్టార్ తో??
X
ఇప్పటివరకు కేవలం యంగ్‌ అండ్‌ కొత్త దర్శకులతోనే సినిమాలు చేసిన దిల్‌ రాజు.. మారిన మార్కెట్‌ డైనమిక్స్ దృష్టిలో పెట్టుకొని.. పెద్ద డైరక్టర్లతో పనిచేస్తానని చెప్పుకొచ్చాడు. తొలి ప్రయత్నంగా త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా అన్నారు. అయితే ఇందులో హీరోఎవరు అనేది ఊహాజనితమే.

ఇప్పుడు ఈ విషయంలో ఒక మెగా న్యూస్ బయటకు వచ్చింది. నిజానికి త్రివిక్రమ్ రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడట. ఒకటి పవన్‌ కళ్యాణ్‌ తో చేస్తుంటే.. మరొకటి రామ్‌ చరణ్‌ తో చేస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా సదరు సినిమాలకు పనిచేసే ఒక బడా పి.ఆర్.ఓ తెలియజేశారు. అయితే.. పవన్‌ కళ్యాణ్‌ ప్రొడక్షన్ లో చెర్రీని డైరక్ట్ చేస్తాడా.. లేకపోతే పవన్‌ తో సినిమా చేసే వచ్చేసి దిల్‌ రాజు ప్రొడక్షన్‌ లో చరణ్‌ ను డైరక్ట్ చేస్తాడా అనే విషయం చూడాల్సిందే. కాని సదరు పి.ఆర్.ఓ మాత్రం ఖచ్చితంగా ''ధృవ'' సినిమా పూర్తయ్యాక.. చరణ్‌ ఒక ప్రక్కన సుకుమార్‌ సినిమా మరో ప్రక్కన త్రివిక్రమ్ సినిమా చేస్తాడట.

ఏదేమైనా కూడా ఇప్పుడు త్రివిక్రమ్ చాలా సార్ట్‌ ఆఫ్టర్ డైరక్టర్ అయిపోయాడు. ముఖ్యంగా ఆయన ఎటువంటి పెద్ద స్టార్లూ లేకుండా.. ''అ..ఆ'' తో ఒక హిట్టు కొట్టాడు చూడండి.. అక్కడ అందరూ పడిపోయారు.