Begin typing your search above and press return to search.
పవన్-త్రివిక్రమ్ మరోసారి జోడి కడతారా?
By: Tupaki Desk | 6 May 2020 7:00 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట. త్వరలోనే అది కూడా పూర్తిచేద్దాం అనుకునేలోపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. అందుకే షూటింగ్స్ ఆపేసి ఎక్కడివారక్కడే ఇళ్లకు అంకితమయ్యారు. పవర్ స్టార్ కూడా వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే మరో కొన్ని ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టారట. ఇదిలా ఉండగా కరోనా భయంతో షూటింగ్స్ నిలిచిపోవడం వలన వకీల్ సాబ్ టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందట. ప్రస్తుతం వరుసగా మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కోరిన దానికి రెట్టింపు చేశారు పవన్. ఆయన నుండి మొదటగా వకీల్ సాబ్ విడుదల కానుంది.
అలాగే క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీ 'విరూపాక్ష' వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరీష్ శంకర్ తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ మూడు సినిమాలు చేయడానికి కనీసం ఓ ఏడాది సమయం పడుతుంది. వాటి అనంతరం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా ఉండబోతుందని అంటున్నారు. నిర్మాత రాధాకృష్ణ నుంచి పవన్ ఇప్పటికే అడ్వాన్స్ తీసుకొని ఉన్నారని టాక్. దీన్ని బట్టి చూస్తే పవన్-త్రివిక్రమ్ సినిమా తప్పకుండా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే పవన్ త్రివిక్రమ్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాడో లేదో కానీ స్క్రిప్ట్ విషయంలో సహాయం అందిస్తాడని వినికిడి. 2021లో ఈ సినిమా మొదలు అవుతుందని అంచనా వేస్తున్నారు.