Begin typing your search above and press return to search.

అతని సినిమాలకంటే స్పీచ్ లోనే కంటెంట్ ఎక్కువ

By:  Tupaki Desk   |   16 Jun 2016 11:00 PM IST
అతని సినిమాలకంటే స్పీచ్ లోనే కంటెంట్ ఎక్కువ
X
నా సినిమాలు థియేటర్ లలో ఆడకుండా టి.విలలో హిట్ అవుతున్నాయంటే అది నాతప్పే. సినిమా చూడాడానికి వచ్చిన సగటు ప్రేక్షకుడిని సంతృప్తిగా పంపడం నా బాధ్యత అని త్రివిక్రమ్ చెప్తే ముచ్చటేస్తుంది.

అయితే అతను సినిమాలు విమర్శలు పాలవుతున్న ప్రతీసారి దాన్ని గురించి వివరిస్తూ ఇచ్చే స్పీచ్ సినిమాల కంటెంట్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఖలేజా విడుదల తరువాత ప్రెస్ మీట్ లో హీరో దైవాంస సంభూతుడుకాదని, తన హీరో పాత్రకు వివరణ ఇచ్చే విధానం మెప్పిస్తుంది. అలానే సన్నాఫ్ సత్యమూర్తి విడుదల సమయంలో తండ్రి పాత్రను చరిత్ర ఎలా మర్చిపోయిందో చెబుతుంటే ఆశ్చర్యమేస్తుంది.

రీసెంట్ గా విడుదలైన అ..ఆ.. సినిమా జస్ట్ మామోలు చిత్రమని అందరూ అంటున్నారని, మామోలుగా వుండడమే మహా కష్టమని, అలా బ్రతికే వారే మహానుభావులంటూ అ..ఆ సక్సెస్ మీట్ లో ఇచ్చిన స్పీచ్ సినిమాకు లింక్ చేసుకున్నా చేసుకోకపోయినా అద్భుతంగా అనిపిస్తుంది. త్రివిక్రమ్ తన సినిమా ప్రదర్శించే ముందు ఆ సినిమా గురించిన స్పీచ్ కూడా ప్లే చేస్తే అనుకున్న దానికన్నా సూపర్ హిట్ అవుతుంది.. ఏమంటారు?