Begin typing your search above and press return to search.
అరవింద క్లైమాక్స్ అందుకే అలా: త్రివిక్రమ్
By: Tupaki Desk | 12 Oct 2018 11:10 AM ISTక్లైమాక్స్ లాంటి ఎపిసోడ్ ఓపెనింగ్ లోనే ఉంటే? దీనికి సమాధానం అరవింద సమేత. సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలు స్లోగా స్టార్ట్ అవుతాయి.. ఒక సంఘటన జరిగిన తర్వాత హీరో ఎవరో తెలియడం..అయన ఫ్లాష్ బ్యాక్ బయటకు రావడం.. అప్పుడు ఓ వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ తో హీరోయిజం ఎలివేట్ చేయడం కామన్. ఇక ఎండింగ్ లో క్లైమాక్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. కానీ 'అరవింద సమేత' కు క్లైమాక్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ భారీ ఫైట్ సీన్ ఉండదు. అయినా ప్రేక్షకులకు నిరాశ కలగదు. మరిది ఎలా ప్లాన్ చేశారు?
ఇదే విషయం గురించి దర్శకుడు త్రివిక్రమ్ ను అడిగితే "మేము కూడా ముందు క్లైమాక్స్ కు యాక్షన్ ఎపిసోడ్ అనుకున్నాం. దాన్ని డిజైన్ కూడా చేసి పెట్టాం. ఒకరోజు సాయంత్రం 6.30కి రామోజీ ఫిలింసిటీలో సిట్టింగ్ మొదలుపెట్టి రాత్రి 2.30 వరకూ చర్చిస్తూనే ఉన్నాం. శత్రు.. బ్రహ్మాజీని షూటింగ్ కూడా లేకుండా కూర్చోబెట్టాను. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆ చర్చ కంటిన్యూ అయింది. కానీ డిస్కషన్ లో అసలు క్లైమాక్స్ ఫైట్ వద్దని చెప్పింది ఫైట్ మాస్టర్లు రామ్ - లక్షణ్. ఈ కథకు డైలాగ్స్ తో వెళ్లడమే కరెక్ట్ అని వాళ్లు చెప్పారు. ఈ విషయంలో రామ్-లక్ష్మణ్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఫైనల్ వారిద్దరూ చెప్పినట్టే ఫైట్ లేకుండా డైలాగ్స్ తోనే ముందుకెళ్ళాలని డిసైడ్ అయ్యాం.
రొటీన్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలను 'అరవింద సమేత' ను వేరు చేసింది ఇలాంటి నిర్ణయాలే. ఏదేమైనా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకు ఫైట్ లేకుండా వెర్బల్ క్లైమాక్స్ ఉంచడం పెద్ద రిస్కే. కానీ ఆడియన్స్ కు కనెక్ట్ అయింది కాబట్టి సినిమాకు ఇదో బలంగా మారింది.