Begin typing your search above and press return to search.

మనం వాటిని చాలావరకూ చంపేశాం:త్రివిక్రమ్

By:  Tupaki Desk   |   9 Oct 2018 12:57 PM IST
మనం వాటిని చాలావరకూ చంపేశాం:త్రివిక్రమ్
X
త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ.. దర్శకుడిగా కంటే అయన కలం నుండి జాలువారే డైలాగ్స్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ మరింత ఎక్కువ. ప్రాసకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడనేవిమర్శ ఉన్నా.. అదే జనాలు త్రివిక్రమ్ ను 'మాటల మాంత్రికుడు' అనే బిరుదు కూడా ఇచ్చారు.. జోక్ ఏంటంటే అది కూడా 'మా.. మాం' అంటూ ప్రాసలో ఉండడం! జనాలకు తెలియకుండానే ప్రాసలో బిరుదిచ్చారేమో.

ఇవన్నీ పక్కనబెడితే త్రివిక్రమ్ కు తెలుగంటే అభిమానం పాళ్ళు మిగతా డైరెక్టర్లతో పోలిస్తే కాస్త ఎక్కువే. దీంతో తన సినిమాల్లో భాష.. ఉచ్ఛారణ విషయాల్లో మరింత శ్రద్ధ తీసుకుంటాడు. ఇక తన సినిమాల్లో ఈమధ్య ఇతర భాషా హీరోయిన్లు నటిస్తున్నప్పటికీ వారు డబ్బింగ్ ఆర్టిస్ట్ లపై ఆధారపడకుండా సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.. అనుపమ పరమేశ్వరన్.. కీర్తి సురేష్.. అను ఇమ్మాన్యుయెల్.. తాజాగా 'అరవింద సమేత' లో పూజా హెగ్డే కూడా స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకుంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఇదే విషయం అడిగితే "నేను వాళ్ళను డబ్బింగ్ చెప్పమని అడగలేదు.. వారంతట వారే ముందుకొచ్చి మేము సొంతంగా డబ్బింగ్ చెప్తామన్నారు" అని క్లారిటీ ఇచ్చాడు. అంటే డబ్బింగ్ విషయంలో గురూజీ బలవంతం లేదన్నమాట.

అంతటితో ఆగితే అయన గూరూజీ ఎందుకవుతాడు?.. "మన తెలుగువాళ్ళకు మన భాషన్నా కల్చర్ అన్నా చులకనభావం. ఇప్పటికే వాటిని చాలావరకూ చంపేశాం. ఇతర భాషల హీరోయిన్లయినా మన భాషకు గౌరవం ఇచ్చి డబ్బింగ్ చెప్తామని అంటున్నారు.. కనీసం వాళ్ళనైనా అలా చెప్పనివ్వండి." అన్నాడు.

నిజమే.. 'పెళ్ళి' అనే పదాన్ని సరైన ఉచ్ఛారణ తో పలకగలిగే హీరోలు ఎంతమంది తెలుగులో ఉన్నారో ఆలోచించుకుంటే మనం మన మాతృభాష తెలుగుకిచ్చే గౌరవం అర్థం అవుతుంది. 'పెళ్ళి ని పెల్లి అని పిల్లి అని పలుకుతాం.. ఉచ్చారణ లేదూ బొంగూ లేదు' అంటే సమాధానం ఇస్తే ఏం చెప్తాం.. పడమరదిశగా అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న గోవా వైపుకు దండం పెట్టడమే.