Begin typing your search above and press return to search.

మహేష్ థియేటర్ లో త్రివిక్రమ్ మొదటి సినిమా!

By:  Tupaki Desk   |   9 Oct 2022 8:00 PM IST
మహేష్ థియేటర్ లో త్రివిక్రమ్ మొదటి సినిమా!
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట ఇండస్ట్రీలోకి రచయితగా అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఇక ఆయన మొదట్లో తీసిన సినిమాలు ఇప్పటికి కూడా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టవు. రచయితగా పనిచేసిన సినిమాలు కూడా ఇప్పటికీ టెలివిజన్లో మంచి రేటింగ్స్ అందుకుంటూ ఉంటాయి.

అయితే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా నువ్వే నువ్వే. తరుణ్ శ్రీయ శరన్ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. ఇక స్రవంతి రవి కిషోర్ సినిమాను నిర్మించారు. 2002 అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో త్రివిక్రమ్ పేరు ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఆ సినిమా వచ్చి ఇప్పుడు 20 ఏళ్లు పూర్తి కావస్తోంది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని మహేష్ బాబు ఏఎమ్‌బి సినిమాస్‌లో ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని నిర్మాత స్రవంతి రవి కిషోర్ అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం, నటీనటులు పాల్గొంటారని ఆయన ధృవీకరించారు. నువ్వే నువ్వే సినిమా మంచి ప్రేమ కథగానే కాకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఒక తండ్రి కూతుర్ల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఆ తర్వాత ఒక ప్రేమికుడు వస్తే ఏ విధంగా మారుతుంది అనే కథను దర్శకుడు చాలా అర్థవంతంగా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాకు కోటి ఇచ్చిన సంగీతం కూడా ఆల్ టైం బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటి అని చెప్పవచ్చు. ఇక సునీల్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చాలా బాగా వైరల్ అయింది. ఎమ్మెస్ నారాయణ సునీల్ మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా ఇప్పటి కూడా సోషల్ మీడియాలో మీమ్స్ తరహాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే