Begin typing your search above and press return to search.

కొత్తోళ్లతో త్రివిక్రమ్.. కష్టమే సుమీ

By:  Tupaki Desk   |   30 July 2016 5:00 PM IST
కొత్తోళ్లతో త్రివిక్రమ్.. కష్టమే సుమీ
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎప్పుడూ ఆ ముగ్గురు హీరోలతోనే సినిమాలు తీసుకుంటూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - అల్లు అర్జున్.. వీళ్లతో మార్చి మార్చి సినిమాలు తీసే త్రివిక్రమ్.. రీసెంట్ గా నితిన్ తో అ..ఆ.. చేశాడు. ఎవరితో ఏ బడ్జెట్ లో చేసినా బ్లాక్ బస్టర్ కొట్టే ట్యాలెంట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు. అయితే.. త్రివిక్రమ్ చేతుల మీదుగా తమ వారసులను లాంఛ్ చేయించేందుకు ప్రయత్నాలు గట్టిగానే జరిగాయి.. జరుగుతున్నాయి.

అక్కినేని అఖిల్ మొదటి సినిమాకి.. రెండో సినిమాకి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు గట్టిగానే వినిపించింది. అఖిల్ ఫెయిల్ తర్వాత రెండో ప్రాజెక్ట్ విషయంలో అయితే ఫైనలైజ్ చేసేశారనే టాక్ కూడా వచ్చింది. తీరా అది రూమర్ అని తేలిపోయింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ అరంగేట్రం చేసే సినిమాని.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తీయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అసలిది సాధ్యమా అంటే.. ఆన్సర్ చెప్పలేరు చాలామంది.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు త్రివిక్రమ్. సహజంగా ఇందుకు 2-3 నెలలు తీసుకుంటాడని అంటారు. డిసెంబర్ నుంచి పవన్ తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉండగా.. ఇప్పుడు మోక్షజ్ఞతో సినిమా స్టార్ట్ చేయడం అంటే చెప్పలేం. పవన్ సినిమా అయ్యాక అంటే.. అదింకా ఏడాదిన్నర తర్వాత విషయం. ఈ లెక్కన త్రివిక్రమ్-మోక్షజ్ఞ కాంబినేషన్ సెట్ కాకపోవచ్చని అంటున్నారు. పైగా కొత్త హీరోలతో సినిమాలకు మాంత్రికుడు అంత ప్రిఫరెన్స్ ఇవ్వడనేది టాక్.