Begin typing your search above and press return to search.

అ..ఆ.. కి ఆ డేట్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   6 Feb 2016 7:10 AM GMT
అ..ఆ.. కి ఆ డేట్ వచ్చేసింది
X
నితిన్, సమంత జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరపుకుంటోంది. ఇప్పటికే 80శాతం పైగా షూటింగ్ పూర్తయిపోయింది. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించుకుని వస్తున్న అ..ఆ.. చిత్రానికి విడుదల తేదీని ఖరారు చేసింది యూనిట్. ఏప్రిల్ 22న అ..ఆ.. మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

సమంతతో పాటు కేరళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి మొదట అనిరుధ్ ని సంగీత దర్శకత్వం కోసం తీసుకోగా.. తర్వాత పరిస్థితుల కారణంగా మిక్కీతో రీప్లేస్ చేయాల్సి వచ్చింది. హారిక అండ్ హాసినీ పతాకంపై రూపొందుతున్న ఈ మూవీ.. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించడంతో.. సినిమా షూటింగ్ పై ఉన్న సందేహాలన్నిటికీ చెక్ పెట్టారు యూనిట్.

అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైందని, ఇప్పటికే 50వరకూ ఖర్చు చేశారని, ఇంకా 30 శాతం షూటింగ్ పెండింగ్ లో ఉందనే వార్తలొచ్చాయి. ఈ మొత్తాన్ని సమకూర్చుకుని, షూటింగ్ చేసేందుకు టైం పడుతుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ఈ రూమర్స్ అన్నిటినీ అ..ఆ.. యూనిట్ ఖండించింది. అనుకున్న ప్రకారమే మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిందని, మార్చ్ లో ఆడియో వేడుక చేసి, ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తామని వెల్లడించింది.