Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ కు ఎదురు చూపులు తప్పవా?
By: Tupaki Desk | 19 Oct 2020 6:15 AM GMTకరోనా కారణంగా పలు సినిమాల షెడ్యూల్స్ తారుమారు అయ్యాయి. చాలా మంది హీరోలు కొన్ని సినిమాలను క్యాన్సిల్ చేసుకోగా మరికొన్ని సినిమాల షెడ్యూల్స్ మార్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. కాని ఆర్ఆర్ఆర్ సినిమా కరోనా కారణంగా ఏడు నెలలు షూటింగ్ జరుపుకోలేదు. ఇటీవలే ఆ సినిమా పునః ప్రారంభం అయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్ వరకు అదే సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉంటాడేమో అంటూ వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఎన్టీఆర్ త్వరగానే ఆ సినిమాను పూర్తి చేసినా వెంటనే త్రివిక్రమ్ తో కాకుండా ప్రశాంత్ నీల్ తో సినిమాను చేస్తాడనే టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల మూవీ ప్రకటన వచ్చింది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ను హోల్డ్ లో పెట్టక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చాలా నెలలుగా ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన ప్రశాంత్ నీల్ తో సినిమాకు సిద్దం అయితే ఈ సమయంలో వెంటనే త్రివిక్రమ్ కు వేరే హీరో లభించడం కష్టం. కనుక త్రివిక్రమ్ మరో ఏడాది పాటు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.
అల వైకుంఠపురంలో వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకోడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కు ఓకే చెప్తే త్రివిక్రమ్ చూస్తూ ఊరుకోడేమో అంటున్నారు. ఎన్టీఆర్ గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నింటికి సమాధానం లభించాలంటే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి అవ్వాలి. అప్పుడే అసలు విషయం క్లారిటీ వచ్చేను.