Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ ఇంకా సగం స్క్రిప్టుతోనే..!
By: Tupaki Desk | 10 Jun 2020 11:15 AM ISTఆర్.ఆర్.ఆర్ సెట్స్ నుంచి రిలీవ్ అవ్వగానే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సెట్స్ కి వెళతాడన్న సంగతి విధితమే. అయితే తారక్ ని ఇప్పటికిప్పుడు విడిచిపెట్టేందుకు జక్కన్న సిద్ధంగా ఉన్నారా లేదా? అన్నది అటుంచితే .. ఇప్పటికే త్రివిక్రమ్ మాత్రం స్క్రిప్టు పని పూర్తి చేస్తున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ మూవీని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారట. త్రివిక్రమ్ సినిమాలో తారక్ ఒక రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడన్న ఊహాగానాలు ప్రచారం అయ్యాయి.
తారక్ రోల్ ఏమిటన్నది ఇప్పటికైతే సస్పెన్స్. తాజాగా లాక్ డౌన్ ముగిసిన అనంతరం త్రివిక్రమ్ తన నివాసంలో ఎన్టీఆర్ ను కలిశారని తెలుస్తోంది. స్క్రిప్టు ఎంతవరకూ పూర్తయినది తారక్ కి చెప్పాడు. సగం స్క్రిప్టుని ఇప్పటికే నేరేట్ చేసేశాడట. ఈ స్క్రిప్టుపై తారక్ చాలా విశ్వాసంతో ఉన్నాడు. సాధ్యమైనంత తొందర్లోనే రెండో పార్ట్ స్క్రిప్టుని పూర్తి చేసేయాలని తారక్ కోరారట.
అయితే త్రివిక్రమ్ ఒకేసారి తారక్ స్క్రిప్టుతో పాటు వెంకీ-నాని స్క్రిప్టుని డెవలప్ చేస్తున్నారు. సైమల్టేనియస్ గా రైటర్లతో వర్క్ నడుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ పూర్తయ్యేప్పటికి తారక్ కి పూర్తి స్థాయి స్క్రిప్టుని రెడీ చేసేస్తారట. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తాయి. జై లవకుశ తర్వాత కళ్యాణ్ రామ్ మరోసారి తారక్ తో కలిసి పని చేస్తుండడం విశేషం.