Begin typing your search above and press return to search.
పవన్ కోసం త్రివిక్రమ్ కొత్త జాబ్
By: Tupaki Desk | 22 Dec 2021 11:00 PM ISTటాలీవు్ ఇండస్ట్రీలో హీరోల మధ్య మంచి అనుబంధం కనిపిస్తుంటుంది. అయితే కొంత మంది మధ్య మాత్రమే అది స్నేహానికి మించి అన్నట్టుగా మారుతుంది. అలాంటి బంధమే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల మధ్య ఏర్పడింది. ఈ అనుబంధం `జల్సా` నుంచి అలాగే కొనసాగుతోంది. త్రివిక్రమ్ ఏం చెప్పినా పవన్ దాన్ని పాజిటివ్ గా తీసుకుని పాటిస్తుంటారు.. త్రివిక్రమ్ కూడా అంతే. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. దాంతో ఆయన పవన్ కోసం కొత్త జాబ్‌ని చేయడం మొదలుపెట్టారు.
త్రివిక్రమ్ పవన్ చేయదగ్గ ప్రాజెక్ట్ లని ఆయన దగ్గరికి తీసుకొస్తున్నారు. అలా వచ్చిందే `భీమ్లా నాయక్`. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ మూవీని సాగర్ చంద్ర తెరకెక్కించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కీలక భూమికని పోషించారు. స్క్రీన్ ప్లే , డైలాగ్స్ తనే అందించడంతో పవన్ డైరెక్షన్ బాధ్యతల్ని సాగర్ చంద్రకు అప్పగించాడు. త్రివిక్రమ్ సపోర్ట్ గా వున్నాడు కాబట్టే ఈ రీమేక్ ని పవన్ చేశారు. లేదంటే చేసేవారు కాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా పవన్ కల్యాణ్ మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రీమేక్ ని కూడా త్రివిక్రమ్ చెప్పడం వల్లే పవన్ అంగీకరించారని తెలుస్తోంది. `వవినోధాయ సితం` పేరుతో రూపొందిన ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్రలో నటించారు. సంచితా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సముద్రఖని నటించి తెరకెక్కించారు. ఇదే పాత్రలో పవన్ కనిపించడానికి ఓకే చెప్పేశారు. తెలుగులో రీమేక్ కానున్న ఈ చిత్రానికి సముద్రఖనినే దర్శకత్వం వహిస్తారట.
`భీమ్లా నాయక్` చిత్రానికి కర్త కర్మ క్రియగా వ్యవహరించి వెన్నుదన్నుగా వుంది ఈ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా రావడంలో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్ తాజా రీమేక్ విషయంలోనూ అదే పాత్రని పోషించబోతున్నారట. స్క్రీప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో కేర్ తీసుకుంటూ ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లో నిర్మించబోతున్నారట త్రివిక్రమ్. దీనికి సహ నిర్మాతగా ఎస్‌టీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రామ్ తాళ్లూరి వ్యవహరిస్తారని తెలిసింది.
ఈ రీమేక్ ని `హరి హర వీర మల్లు` పూర్తయిన తరువాతే సెట్స్ పైకి తీసుకురానున్నారట. హరీష్ శంకర్ `భవధీయుడు భగత్ సింగ్ ` షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మధ్యలో రీమేక పూర్తి చేసి ఆ తరువాతే హరీష్ శంకర్ సినిమాని పూర్తి చేయాలనే ఆలోచనలో పవన్ కల్యాణ్ వున్నారని, అందుకే `హరి హరి వీర మల్లు` తరువాత రీమేక్ మూవీ సెట్స్ పైకి వెళుతుందిని చెబుతున్నారు.