Begin typing your search above and press return to search.
పవన్ పచ్చజెండా ఊపేశాడా?
By: Tupaki Desk | 1 Jun 2016 4:29 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అభిమానులకు భలే ఆసక్తి. ఈ ఇద్దరు మిత్రుల కాంబనేషన్లో వచ్చిన తొలి సినిమా ‘జల్సా’ అంచనాల్ని అందుకోలేకపోయినా.. ‘అత్తారింటికి దారేది’ మాత్రం రికార్డుల మోత మోగించింది. మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత మళ్లీ పవన్ తోనే సినిమా చేయాలని త్రివిక్రమ్ అనుకున్నాడు కానీ.. పవన్ పొలిటికల్ కమిట్మెంట్లతో బిజీగా ఉండటంతో కుదర్లేదు. దీంతో తాను గతంలో ఎప్పుడో రాసుకుని పక్కనబెట్టేసిన ‘అ..ఆ’ కథతో నితిన్-సమంత హీరో హీరోయిన్లుగా సినిమా తెరకెక్కించాడు.
ఇప్పుడిక ‘అ..ఆ’ రిలీజ్ కు రెడీ అయిపోయింది. త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఏదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబుతో ఓ కమిట్మెంట్ ఉంది కానీ.. అతడితో వెంటనే సినిమా చేయాల్సిన అవసరం లేదు. అందుకు టైం పట్టేట్లుంది. ఈ లోపు పవన్ తోనే ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు త్రివిక్రమ్. ఇటీవలే పవన్-త్రివిక్రమ్ కలిసి ఓ సబ్జెక్టుపై డిస్కస్ చేసుకుని ఏకాభిప్రాయానికి వచ్చేశారట. పవన్ ఓకే చెప్పేయడంతో ఇక పూర్తి స్థాయి స్క్రిప్టు తయారు చేసుకునే పనిలో పడ్డాడట త్రివిక్రమ్. ఎస్.జె.సూర్యతో పవన్ చేస్తున్న నవంబర్లో పూర్తవుతుంది. ఆ సమయానికి త్రివిక్రమ్ రెడీ అయిపోతాడు. ఏడాది ఆఖర్లో ఈ సెన్సేషనల్ కాంబినేషన్లో సినిమా మొదలయ్యే అవకాశముంది. వచ్చే వేసవికి సినిమా రెడీ అవ్వొచ్చేమో.