Begin typing your search above and press return to search.
పవన్ అలా నిర్ణయించుకొన్నాడా?
By: Tupaki Desk | 2 July 2016 11:00 PM ISTపవన్ కళ్యాణ్ ఒకటి తలిస్తే వాస్తవంలో మరొకటి జరుగుతున్నట్టుంది. ఎస్.జె.సూర్యతో సినిమా చేసి ఫ్యాన్స్ కి మళ్లీ ఖుషీ రోజుల్ని గుర్తుకు తెప్పించాలనుకొన్నాడు. కానీ ఊహించని రీతిలో ఎస్.జె.సూర్య ప్రాజెక్టు నుంచి బయటికెళ్లిపోయాడు. దీంతో పవన్ చేసేదేమీ లేక మరో దర్శకుడు డాలీని ఎంపిక చేసుకొన్నాడు. అయితే ఆకుల శివ రాసిన ఆ కథ డాలీకి సెట్టవ్వడం లేదట. స్క్రిప్టు తనదైన స్టైల్ లో రాసుకోవడానికి కాస్త సమయం కావాలని అడుగుతున్నాడట. దాంతో ఆ ప్రాజెక్టు మొత్తాన్ని పక్కనపెట్టేసి త్రివిక్రమ్ తో సినిమా చేయాలని పవన్ నిర్ణయించుకొన్నట్టు తెలిసింది.
ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కోసమే కథని సిద్ధం చేస్తున్నాడు. సెప్టెంబరులోపు ఆయన స్క్రిప్టుని సిద్ధం చేస్తాడట. అక్టోబరులో షూటింగ్ ని మొదలుపెట్టి సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకొన్నట్టు తెలిసింది. అయితే ఆ ప్రాజెక్టుకి నిర్మాత ఎవరన్నదే తెలియడం లేదు. ఒకపక్క దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన సంస్థలో పవన్ తో ఒక్క సినిమా అయినా చేయాలనేది దిల్‌రాజు ఆశ. ఎలాగో త్రివిక్రమ్-పవన్ ల క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఇంతకంటే మంచి ఛాన్స్ మరొకటి ఉండదని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.