Begin typing your search above and press return to search.

చెయ్ తో మాంత్రికుడు.. ఫిక్స్అయ్యాడా?

By:  Tupaki Desk   |   7 March 2017 3:51 PM IST
చెయ్ తో మాంత్రికుడు.. ఫిక్స్అయ్యాడా?
X
అక్కినేని నాగచైతన్య.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్.. కొన్ని నెలలుగా వినిపిస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టు సాధ్యం కాలేదు కానీ.. ఇప్పుడు అంతా ఓకే అనుకున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్యతో త్రివిక్రమ్ మూవీ ఇప్పుడు ఖాయమైందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు సెట్ కావడంలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించినట్లు టాక్.

ఈ ప్రాజెక్టును స్వయంగా తనే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్నారట నాగ్. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఏడాది చివరకు ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారట నాగార్జున. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు త్రివిక్రమ్. ఇది వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉండగా.. అక్టోబర్ నాటికి ఫినిష్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్.. కళ్యాణ్ కృష్ణ మూవీతో బిజీగా ఉన్నాడు చైతు. దీని తర్వాత కొత్త ప్రాజెక్టులేమీ సైన్ చేయలేదు.

అటు చైతు.. ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ దాదాపుగా ఒకే సమయానికి ఫ్రీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉండగా.. ఈ ఏడాది చివరకు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/