Begin typing your search above and press return to search.

మ‌హేష్ కోసం ఫుల్ స్వింగులో మాయావి

By:  Tupaki Desk   |   19 May 2021 11:00 AM IST
మ‌హేష్ కోసం ఫుల్ స్వింగులో మాయావి
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ ఎంట‌ర్ టైన‌ర్ కి స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అత‌డు- ఖ‌లేజా త‌ర్వాత హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో ఆస‌క్తి నెల‌కొంది. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించినంత రాణించ‌క‌పోయినా త్రివిక్ర‌మ్ తో మ‌హేష్ సినిమా అన‌గానే ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో స్పీడ్ మీదున్న త్రివిక్ర‌మ్ ఈసారి మ‌హేష్ తో మ్యాజిక్ చేస్తార‌నే ఆశిస్తున్నారు.

తాజా సమాచారం మేర‌కు.. త్రివిక్ర‌మ్ బృందం ఫుల్ స్వింగ్ లో ఉన్నార‌ని తెలిసింది. తార‌క్ తో ప్రాజెక్ట్ వాయిదా ప‌డ్డాక‌.. మాయావికి మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. వెంట‌నే త్రివిక్ర‌మ్ త‌న ప‌ని మొద‌లెట్టేశారు. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడక్షన్ పూర్తి స్వింగ్ లో ఉంది.

ఓవైపు `సర్కారు వారి పాట` చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తూనే సైమ‌ల్టేనియ‌స్ గా త్రివిక్ర‌మ్ తో చిత్రీక‌ర‌ణ‌కు వెళ‌తార‌ట‌. త్రివిక్రమ్ తన బృందంతో కలిసి ఈ చిత్రం కోసం సిద్ధం చేయాల్సిన ప్రత్యేక సెట్ పై చర్చలు ప్రారంభించారు. ఈ సెట్ లో మొదటి షెడ్యూల్ తెర‌కెక్కుతుంది. సెట్ లోనే చాలా వరకు షూట్ జరుగుతుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే మూవీ షెడ్యూల్స్ గురించి న స‌మాచారం తెలియాల్సి ఉంది.