Begin typing your search above and press return to search.
'మహేష్ - త్రివిక్రమ్' కాంబోలో హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందంటే..?
By: Tupaki Desk | 30 April 2021 12:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరి కాంబోలో ఇంతకముందు వచ్చిన 'అతడు' విజయం సాధించగా.. 'ఖలేజా' పరాజయం చవిచూసింది. అయితే ఈ పదేళ్ల గ్యాప్ లో వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీ రాబోతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో మహేష్ కూడా త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని ప్రకటించారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కలయికలో ఈసారి ఎలాంటి సినిమా రాబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
మహేష్ - త్రివిక్రమ్ కలిసి మొదటిసారి చేసిన 'అతడు' సినిమా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఆ తర్వాత వచ్చిన 'ఖలేజా' సినిమా మహేష్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించిన కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. అయితే ఇప్పుడు వీరి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కథ ఫ్యామిలీ ఎమోషనల్స్ - కామెడీ - యాక్షన్ కలబోసి రెడీ చేస్తున్నారట. 'అరవింద సమేత' 'అల వైకుంఠపురంలో' వంటి వరుస హిట్స్ అందుకున్న త్రివిక్రమ్.. ఇప్పుడు మహేష్ తో 'అతడు' తరహా సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అవడంతో త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ కోసం ఫ్రెష్ కథను తయారుచేస్తున్నారని టాక్. హాసిని అండ్ హారిక బ్యానర్ లో ఈ సినిమా రూపొందే అవకాశం ఉంది. 'సర్కారు వారి పాట' షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.