Begin typing your search above and press return to search.
మహేష్.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది?
By: Tupaki Desk | 23 April 2021 7:00 PM ISTఎన్టీఆర్ 30 సినిమాకు దర్శకత్వం వహించాల్సిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ను క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ మూవీ క్యాన్సిల్ అయిన వెంటనే మహేష్ బాబుతో సినిమా కన్ఫర్మ్ అయ్యింది. దాదాపుగా పదేళ్ల నుండి మహేష్ బాబు.. త్రివిక్రమ్ ల కాంబోలో మూవీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇద్దరి మద్య విభేదాల కారణంగా సినిమా రావడం లేదు అని ఆమద్య పుకార్లు షికార్లు కూడా చేశాయి. ఎట్టకేలకు వీరిద్దరి కాంబోలో సినిమా కన్ఫర్మ్ అయ్యింది. అధికారిక ప్రటక రావడమే తరువాయి. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రాన్ని చేస్తున్న మహేష్ బాబు ఆ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఓకే చెప్పడం కూడా జరిగిందట.
ఇప్పటికే కథ పరమైన చర్చలు జరిగాయి. స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే వాటిని కూడా త్రివిక్రమ్ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల మహేష్ తో మరోసారి స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ చర్చలు జరిపారని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమా స్క్రిప్ట్ వ్యవహారాలతో పాటు నిర్మాణంకు సంబంధించిన విషయాలపై కూడా ఒక స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మించనున్నాడు. నిర్మాణంలో త్రివిక్రమ్ మరియు మహేష్ బాబులు కూడా భాగస్వామ్యులు ఉంటారని తెలుస్తోంది.
స్క్రిప్ట్ సిద్దం చేసిన త్రివిక్రమ్ ఇప్పటికే హీరోయిన్ గా పూజా హెగ్డేను ఖరారు చేశాడని సమాచారం. మరో వైపు ఇతర నటీనటుల విషయంలో చర్చలు జరుపుతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మే 31వ తారీకున సినిమాను లాంచనంగా ప్రారంభించాలని భావిస్తున్నారు. జులై నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాలని భావిస్తున్నారు. సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి అవ్వక ముందే ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ ఒకటి రెండు నెలల్లో తగ్గి పరిస్థితులు కుదుట పడితే మహేష్ బాబు.. త్రివిక్రమ్ ల కాంబో మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతిలోనే రాబోతున్న విషయం తెల్సిందే.