Begin typing your search above and press return to search.
'అతడు' అభిమానుల ఆశ నిరాశేనా?
By: Tupaki Desk | 15 Dec 2020 11:00 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన అతడు సినిమా థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకున్నా కూడా ఇప్పటికి కూడా ఆ సినిమా బుల్లి తెరపై హిట్ అనిపించుకుంటూనే ఉంది. టీవీలో టెలికాస్ట్ అయిన ప్రతి సారి కూడా జనాలు స్క్రీన్ లకు అతుక్కు పోతున్నారు. అదో అద్బుత సినిమాగా నిలిచి పోయింది అనడంలో సందేహం లేదు. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఖలేజా సినిమా నిరాశ పర్చింది. అది కూడా బుల్లి తెరపై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు సినిమాలు కమర్షియల్ గా ఎలాంటి ఫలితాలను ఇచ్చినా కూడా అభిమానులు మాత్రం మళ్లీ వీరి కాంబో మూవీని కోరుకుంటున్నారు అనడంలో నూటికి నూరు శాతం నిజం ఉంది.
అభిమానులు కోరుకుంటున్న విషయం మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ లకు కూడా తెలుసు. కాని కొన్ని కారణాల వల్ల వీరి కాంబో మూవీ పట్టాలెక్కడం లేదు. ప్రస్తుతం వీరిద్దరు బిజీ బిజీగా ఉన్నారు. వీరి కాంబో మూవీ గురించి జనాలు వెయిట్ చేసి చేసి విసిగి పోయి మర్చి పోయిన సమయంలో మహేష్ బాబు మళ్లీ ఆశ కల్పించేలా మా ఇద్దరి కాంబో మూవీ ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. దాంతో మళ్లీ అభిమానులు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కాని ఇద్దరు ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదు. దాంతో మళ్లీ అభిమానులకు నిరాశ తప్పదేమో అనిపిస్తుంది. వీరిద్దరి కాంబోలో రాబోయే రెండేళ్ల వరకు మూవీ ఉండే అవకాశం ఎక్కడ కూడా కనిపించడం లేదు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.