Begin typing your search above and press return to search.
మెగా అభిమానులకు ఆ భాగ్యం ఉందా? లేదా?
By: Tupaki Desk | 25 Nov 2020 5:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఉవ్విల్లూరుతున్నారు. ఇప్పటికే ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో వైపు లూసీఫర్ రీమేక్ కు పనులు జరుగుతున్నాయి.. వేదాళం రీమేక్ పట్టాలెక్కేందుకు రెడీగా ఉంది. ఈమూడు సినిమాలు కాకుండా చిరంజీవి త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు అంటూ చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మూవీ అంటే ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అనడంలో సందేహం లేదు అన్నట్లుగా అంతా నమ్మకంగా ఉన్నారు.
ఆమద్య ఈ కాంబో గురించి మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ కొన్నాళ్ల క్రితమే చిరంజీవి కోసం కథ రెడీ చేశారని.. ఇద్దరు ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల తర్వాత ఇద్దరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాని ఈమద్య మళ్లీ ఈ కాంబో మూవీ గురించి వార్తలు రావడం లేదు. అసలు వీరిద్దరి కాంబోలో సినిమా ఉందా లేదా అన్న రీతిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సినీ వర్గాల వారికి కూడా ఈ విషయంలో స్పష్టత కరువయ్యింది. తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోతున్నాడు. ఆ తర్వాత రామ్ తో సినిమా ఉండే అవకాశం ఉంది. మరో వైపు మహేష్ బాబు కూడా ఈయన దర్శకత్వంలో సినిమాకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్.. చిరంజీవి కాంబో మూవీ వస్తుందా లేదా అనేది చూడాలి.