Begin typing your search above and press return to search.
ఈసారి వివాదం లేకుండా అఫిషియల్ రీమేక్..!
By: Tupaki Desk | 21 Oct 2018 12:26 PM ISTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ సినిమా చేసినా కూడా కథ విషయంలో వివాదం రాజుకుంటున్న విషయం తెల్సిందే. అజ్ఞాతవాసి సినిమా అంతర్జాతీయ స్థాయిలో వివాదంను రేపడం జరిగింది. ఇప్పుడు అరవింద సమేత చిత్రం నా కథ అంటూ వేంపల్లి గంగాధర్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అంతకు ముందు వచ్చిన అఆ చిత్రం కూడా కాపీ అంటూ విమర్శలు వచ్చాయి. ఇంకా త్రివిక్రమ్ ప్రతి సినిమా విషయంలో కూడా ఇలాంటి వివాదాలు కామన్ అయ్యాయి. అందుకే ఈసారి అఫిషియల్ రీమేక్ చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ నుండి సమాచారం అందుతుంది.
‘అరవింద సమేత’ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుంది. 100 కోట్ల షేర్ దిశగా ఈ చిత్రం పరుగులు తీస్తుంది. ఇలాంటి నేపథ్యంలో త్రివిక్రమ్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా ఉండటం చాలా కామన్. ఇక త్రివిక్రమ్ తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో అనే విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. అందుకే వీరిద్దరి కాంబో మూవీ మరోసారి సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.
అల్లు అర్జున్ కోసం ఒక బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నాడు. బాలీవుడ్ లో ‘సోను కే టిటు కి స్వీటీ’ అనే చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఆ చిత్రంను ఇప్పుడు బన్నీ కోసం తెలుగులో రీమేక్ చేసేందుకు త్రివిక్రమ్ సిద్దం అవుతున్నాడు. బన్నీ ఇమేజ్ కు తగ్గట్లుగా, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
‘సోను కే టిటు కి స్వీటీ’ చిత్రాన్ని నిర్మించిన టీ సిరీస్ తెలుగు రీమేక్ నిర్మాణ భాగస్వామి కావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ కు చెందిన పలు నిర్మాణ సంస్థలు తెలుగులో సినిమాల నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్నాయి. టీ సిరీస్ చాలా రోజులుగా తెలుగు సినిమా నిర్మాణంలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఈ రీమేక్ తో త్రివిక్రమ్ - బన్నీలతో కలిసి టీ సిరీస్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.