Begin typing your search above and press return to search.

'కోబ‌లి'పై ఆ క‌థ‌నాలకు ఆధారం ఏదీ?

By:  Tupaki Desk   |   28 April 2021 9:00 PM IST
కోబ‌లిపై ఆ క‌థ‌నాలకు ఆధారం ఏదీ?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `అత్తారింటికి దారేది` ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ అందుకున్నాక మ‌రోసారి త్రివిక్ర‌మ్ తోనే ప‌వ‌న్ సినిమా చేస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆ సినిమా టైటిల్ కోబ‌లి. స్క్రిప్టుప‌నుల్ని పూర్తి చేసిన త్రివిక్ర‌మ్ ఇక సెట్స్ కెళ్లేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌చార‌మైంది. కానీ ర‌క‌రకాల కార‌ణాల‌తో ఆ సినిమా టేకాఫ్ కాలేదు.

అయితే ఇటీవ‌లి కాలంలో త్రివిక్ర‌మ్ మ‌రోసారి కోబ‌లి స్క్రిప్టు దుమ్ము దులిపేస్తున్నాడంటూ కాన్ఫిడెంట్ గా కొన్ని క‌థ‌నాలు రావ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో విస్మ‌యం వ్యక్త‌మ‌వుతోంది. నిజానికి ఈ సినిమా గురించి త్రివిక్ర‌మ్ ఎక్క‌డా మీడియా ముఖంగా పెద‌వి మెద‌ప‌లేదు. ఇటీవ‌ల ఆ టాపిక్కే రాలేదు. కానీ క‌థ‌నాలు మాత్రం వైర‌ల్ అయ్యాయి. ప‌వ‌న్ తో కోబ‌లి చేసేందుకు రెడీ అవుతున్నాడ‌ని మ‌రో ఏడాది త‌ర్వాత అందుకు ఆస్కారం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

మ‌రోవైపు ఎన్టీఆర్ తో సినిమాని డ్రాపైన త్రివిక్ర‌మ్ త‌దుప‌రి మ‌హేష్ తో సినిమా చేయ‌నున్నారు. ప‌వ‌న్ వ‌రుస‌గా మూడు నాలుగు చిత్రాల‌తో బిజీ. అయ్యప్పనమ్ కోషియం తెలుగు రీమేక్ .. క్రిష్ తో హరి హర వీర మల్లు.. పిఎస్ పికె 28 లతో బిజీగా ఉన్నారు. ఇవ‌న్నీ పూర్తి చేసే స‌రికి త్రివిక్ర‌మ్ మ‌రో స్క్రిప్టుతో రెడీ అయ్యేందుకు ఆస్కారం ఉంది.