Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్ `కోబ‌లి` స్క్రిప్టు రెడీ ఫ‌ర్ సేల్?

By:  Tupaki Desk   |   27 April 2021 5:00 AM IST
త్రివిక్ర‌మ్ `కోబ‌లి` స్క్రిప్టు రెడీ ఫ‌ర్ సేల్?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ `కోబ‌లి` అనే సినిమా తెర‌కెక్కించాల‌ని ప్ర‌య‌త్నించిన‌ సంగ‌తి తెలిసిందే. అత్తారింటికి దారేది త‌ర్వాత సెట్స్ కెళ్లాల్సిన‌ది. స్క్రిప్టు రెడీ చేసి టీమ్ ని ప్రిపేర్ చేసుకుని ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కుద‌ర‌క‌ ఆపేశారు.

కానీ ఆ స్క్రిప్టుపై త్రివిక్ర‌మ్ మ‌మ‌కారం అలానే ఉంది. ప‌వ‌న్ రెడీగా ఉంటే దాంతో సినిమా తీయాల‌ని భావిస్తున్నాడు. కానీ స‌న్నివేశం చూస్తుంటే ఇప్ప‌ట్లో వీలుప‌డేట్టు లేదు. ప‌వ‌న్ వ‌రుస‌గా మూడు నాలుగు సినిమాల‌కు క‌మిట‌య్యాడు. తాను కూడా మ‌హేష్ తో సినిమాకి క‌మిట‌య్యాడు. ప‌వ‌న్ అందుబాటులోకి వ‌చ్చే వ‌ర‌కూ త్రివిక్ర‌మ్ వేచి చూడాల్సిన ప‌రిస్థితి.

అయితే మారే కాలానికి అనుగుణంగా స్క్రిప్టు మోడల్ కూడా మారిపోతుంది. అంటే మ‌ళ్లీ మ‌ళ్లీ రీవ‌ర్క్ చేయాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. అందుకే ఈ స్క్రిప్టును వృధా చేయ‌కుండా ప‌వ‌న్ తో చేయాల‌నుకునే వేరొక ద‌ర్శ‌కుడికి ఇచ్చేందుకు కూడా త్రివిక్ర‌మ్ సిద్ధంగా ఉన్నార‌ట‌. అందుకే దానిని పూర్తి స్థాయిలో బౌండ్ స్క్రిప్టు చేసి విక్ర‌యించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది.

నిజానికి తాను తీయాల్సిన‌దే అయినా ఇప్ప‌ట్లో కుద‌ర‌ని స‌న్నివేశంలోనే వేరొక‌రికి బ‌దిలీ చేసే ఆలోచన ఉంద‌ట‌. అలా కాక‌పోతే ప‌వ‌న్ క‌నీసం 3 నెల‌ల కాల్షీట్లు త‌న‌కు ఇచ్చినా వెంట‌నే పూర్తి చేయాల‌న్న ఆలోచ‌న ఉంది. కానీ ప‌వ‌న్ కాల్షీట్ల విష‌యంలో క్లారిటీ లేదు. క‌నీసం స్క్రిప్టు వ‌ర‌కూ సేల్ అయినా సంతోష‌మే. అయినా కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.