Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ ఈసారి రీమేక్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   4 Jan 2018 2:16 PM IST
త్రివిక్రమ్ ఈసారి రీమేక్ చేస్తున్నాడా?
X
టాలీవుడ్ ఈ మధ్య రీమేక్స్ చాలా ఎక్కువయ్యాయి. చాలా మంది హీరోలు కొంచెం డౌన్ లో ఉన్నప్పుడు ఎక్కువగా రీమేక్ కథలను ఎంచుకుంటున్నారు. ఇకపోతే టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా గత కొంత కాలం నుంచి ఎక్కువగా రీమేక్ కథలనే చేస్తున్నాడు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక డైరెక్ట్ సినిమా చేస్తున్నాడని తెలిసిన తరువాత వెంకీ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫిల్ అయ్యారు.

అయితే ఆ సినిమా కథ రీమేక్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల హారికా హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూసర్ జాలి LLB 2 కథ రీమేక్ హక్కులను దక్కించుకున్నాడు. అయితే త్రివిక్రమ్ - వెంకీ సినిమాను ఈ సంస్థ అధినేత రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు కాబట్టి ఆ కాంబినేషన్ లో వచ్చే సినిమా కథ అదేనని ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ ఇప్పటివరకు రీమేక్ కథలకు దర్శకత్వం చేయలేదు. ఆయనకు ఆ అవసరం కూడా రాలేదు. ఏదో కొన్ని సీన్లను తీసుకుని.. ఆలోచనలతో ఆలోచింపే జేసే విధంగా త్రివిక్రమ్ కథలను రాయగలడు. కానీ ఇప్పుడు అక్షయ్ కుమార్ కథ నచ్చిందో ఏమో మరి సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడని సందేహాలు వెలువడుతున్నాయి.

మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఆ చిత్ర యూనిటే చెప్పాలి. ఇక అజ్ఞాతవాసి సినిమాలో వెంకీ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.