Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లేనా?
By: Tupaki Desk | 12 Jan 2018 5:08 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి యూత్ లో ఎంత మంచి ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని అపజయలను చూసినా కూడా పవన్ వెంటే నడిచారు. ఒక్క హిట్టు కావాలని అడిగినందుకు పవన్ ఎంతో కష్టపడి జాగ్రత్తగా గబ్బర్ సింగ్ తో అభిమానులకు ఆనందాన్ని ఇచ్చాడు ఆ తరువాత అత్తారింటికి దారేది సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకొని పవన్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. జల్సా తరువాత త్రివిక్రమ్ హిట్ ఇచ్చాడు అని ఆ కాంబో పై అంచనాలు చాలా పెరిగాయి.
కొన్ని వరుస ఫెయిల్యూర్స్ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో అజ్ఞాతవాసి తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్ని అంచనాలు మొదలయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా పవన్ రాజకీయాల్లోకి బిజీ అవుతున్న టైమ్ లో సినిమా రావడం పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. అందులోనూ త్రివిక్రమ్ ప్రాణంగా ఇష్టపడే పవన్ తో వర్క్ చేస్తున్నాడు కాబట్టి తన పెన్ను పవర్ చాలానే చూపిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తరువాత ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి. ఫ్యాన్స్ కూడా సినిమాను ఏ మాత్రం ఇష్టపడలేకపోయారు.
సినిమాని తీసింది త్రివిక్రమ్ అస్సలు కాదు ఇంకా ఎవరో చేసి ఉంటారు అని కామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కెరీర్ లో ఖలేజా కి కొంచెం నెగిటివ్ టాక్ వచ్చి ఫెయిల్యూర్ అయ్యింది. కానీ ఓ వర్గం ప్రేక్షకులకు ఆ సినిమాలో కామెడీ బాగా నచ్చుతుంది. కానీ అజ్ఞాతవాసి అలా కూడా లేదు. దీంతో త్రివిక్రమ్ ఇంత దారుణంగా తీశాడేంటి అని తల కొట్టుకుంటున్నారు. అయితే అందుకు ఓ కారణం లేకపోలేదు అని ఓ వర్గం ప్రేక్షకుల నుంచి టాక్ వినిపిస్తోంది. అంతా అతని ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటున్నారు. ప్రతి సినిమాలో మిస్టేక్స్ ఉంటాయి. కానీ అంతా నాకు తెలుసని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సినిమా ఫలితం గట్టి దెబ్బ కొట్టడం ఖాయమని అజ్ఞాతవాసి నిరూపించింది. మరి నెక్స్ట్ అయినా త్రివిక్రమ్ పవన్ కి మంచి హిట్టు ఇస్తాడో లేదో చూడాలి.