Begin typing your search above and press return to search.

ఈ ఘనతంతా త్రివిక్రముడిదే...

By:  Tupaki Desk   |   3 Jun 2016 12:06 PM IST
ఈ ఘనతంతా త్రివిక్రముడిదే...
X
ఓవర్సీస్ ఆడియన్స్ ఎలాంటి సినిమాలు కోరుకుంటారో అలాంటి సినిమాలే తీసే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకే హీరో ఎవరైనా సరే.. త్రివిక్రమ్ సినిమా అంటే చాలు మరో ఆలోచన లేకుండా థియేటర్లకు వెళ్లిపోతున్నారు అక్కడి జనాలు. గత ఏడాది ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి డివైడ్ టాక్ వచ్చినా సరే.. మిలియన్ క్లబ్బును ఈజీగా దాటేసింది. ఇక త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ ‘అఆ’కు స్టార్ పవర్ లేకపోయినా సరే.. అదిరిపోయే ఓపెనింగ్స్ సాధిస్తోంది ఓవర్సీస్‌ టెరిటరీల్లో. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రిమియర్ షోలతో ‘అఆ’ 2.5 లక్షల డాలర్లు.. అంటే రూపాయల్లో 1.75 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

నితిన్ లాంటి హీరో సినిమాకు ఈ స్థాయిలో ప్రిమియర్ షో కలెక్షన్లు రావడం చిన్న విషయం కాదు. ఇదంతా త్రివిక్రమ్ ఘనతే అనడంలో సందేహం లేదు. ఈ సమ్మర్లో వచ్చిన భారీ సినిమాలన్నీ యుఎస్ ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచాయి. సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం డిజాస్టర్లుగా నిలవగా.. ‘సరైనోడు’ తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టినా.. యుఎస్ లో మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపించిన ‘అఆ’ మీద బాగా ఆసక్తి చూపించారు. ఏకంగా 130 లొకేషన్లలో దీనికి ప్రిమియర్ షోలు పడ్డాయి. మంచి కలెక్షన్లు వచ్చాయి. టాక్ కూడా పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో ‘అఆ’ ఈజీగా మిలియన్ క్లబ్బుల్లో చేరిపోతుందనడంలో సందేహంలేదు.