Begin typing your search above and press return to search.

మహేష్ కోసం త్రివిక్రమ్ కూడా అక్కడికే!

By:  Tupaki Desk   |   4 Jun 2022 5:31 AM GMT
మహేష్ కోసం త్రివిక్రమ్ కూడా అక్కడికే!
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల..వైకుంఠపురములో సినిమా తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికీ ఆ ప్లాన్ ఏమాత్రం వర్కౌట్ కాకపోవడంతో వెంటనే మహేష్ బాబుని లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు కూడా కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు వాయిదాలు లేకుండా షూటింగ్ పూర్తి చేయాలి అని త్రివిక్రమ్ ఆలోచనలో పడ్డాడు.

జూలై నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే ప్రత్యేకంగా ఒక కాలనీ సెట్ కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు యూరప్ లో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక ఆ వెకేషన్ పూర్తి కాగానే షూటింగ్లో అడుగుపెడతాడు అని తెలుస్తోంది. అయితే మహేష్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది అని త్రివిక్రమ్ మహేష్ బాబు దగ్గరికి వెళ్లి మరికొన్ని విషయాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మహేష్ జర్మనీ ట్రిప్ కు త్రివిక్రమ్ కూడా వెళ్లి అక్కడ స్క్రిప్ట్ విషయంలో మాట్లాడబోతూన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్టు మొత్తం రెడీ అయింది. కానీ మహేష్ బాబుకు కొన్ని డౌట్స్ ఉండటంతో వాటి పై క్లారిటీ ఇవ్వడానికి త్రివిక్రమ్ సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఈ సినిమా యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక ఎప్పటిలానే త్రివిక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను సెలెక్ట్ చేసుకో గా హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే.

అలాగే మరి కొంతమంది నటీనటుల విషయంలో కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక ఆ తర్వాత మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ తో బిజీ కానున్న విషయం తెలిసిందే.