Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ - రానా చిత్రంలో త్రివిక్ర‌మ్‌.. కార‌ణం ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   25 March 2021 6:00 AM IST
ప‌వ‌న్ - రానా చిత్రంలో త్రివిక్ర‌మ్‌.. కార‌ణం ఇదేన‌ట‌!
X
మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'అయ్య‌ప్పనుమ్ కోషియం' రీమేక్ లో పవన్ కల్యాణ్ - రానా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా చేరిపోయారు. స్క్రీన్ ప్లేతోపాటు మాటలు కూడా ఆయనే అందించబోతున్నారు.

అయితే.. ఒక ద‌ర్శ‌కుడు సినిమా తెర‌కెక్కిస్తుండ‌గా.. మ‌రో డైరెక్ట‌ర్ ను తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏంట‌నే చ‌ర్చ అప్ప‌ట్లోనే జ‌రిగింది. ఆ డౌట్ చాలా మందికి అలాగే మిగిలిపోయింది కూడా. లేటెస్ట్ గా ఆ సందేహానికి స‌మాధానం ఇచ్చారు చిత్ర నిర్మాత సూర్య‌దేవర నాగ‌వంశీ.

టాలీవుడ్లో భారీ మ‌ల్టీసార‌ర్ గా తెర‌కెక్కుతోందీ చిత్రం. ఈ మూవీలో ప‌వ‌న్ - రానా ప్ర‌తినాయ‌కులుగా క‌నిపించ‌బోతున్నారు. ఇలాంటి బిగ్ మూవీని హ్యాండిల్ చేసే సాగ‌ర్ చంద్రకు ఎవ‌రైనా సీనియ‌ర్ స‌పోర్టు ఉంటే బాగుంటుంద‌ని భావించాం అన్నారు నిర్మాత‌. అంతేకాదు.. ప‌వ‌న్ - రానా ఒక‌రినొక‌రు ఢీకొన‌బోతున్న ఈ చిత్రంలో డైలాగుల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంద‌ని చెప్పారు.

ఈ రెండు అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ప్పుడు త్రివిక్ర‌మ్ అయితే బాగుంటుంద‌ని భావించామ‌న్నారు నాగవంశీ. మల్టీసార‌ర్ స్క్రిప్టును ఎలా మ‌ల‌చాలో తగిన సూచ‌న‌లు చేయ‌డంతోపాటు, డైలాగ్ డైన‌మైట్స్ ను పేల్చే బాధ్య‌త‌ను కూడా మాట‌ల మాంత్రికుడికే అప్ప‌జెప్పిన‌ట్టు తెలిపారు. ఈ కార‌ణం వ‌ల్ల‌నే తివిక్ర‌మ్ ‘ఏకే' టీమ్ లో చేరిపోయాారని క్లారిటీ ఇచ్చారు నాగ‌వంశీ. ఈ మూవీని సెప్టెంబ‌రులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.