Begin typing your search above and press return to search.

క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప‌నిలో మాయావి ఫింగ‌రింగ్?

By:  Tupaki Desk   |   5 Sept 2021 1:00 PM IST
క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప‌నిలో మాయావి ఫింగ‌రింగ్?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి త్రివిక్ర‌మ్ పై ఉండే న‌మ్మ‌కం వేరు. ఆయ‌న నేరేష‌న్ స్కిల్స్ అంటే విప‌రీత‌మైన న‌మ్మ‌కం. ఇద్ద‌రు స్నేహితులు కావ‌డం.. త్రివిక్ర‌మ్ గొప్ప రైట‌ర్ కావ‌డంతో ప‌వ‌న్ అత‌న్ని ఎక్కువ‌గానే న‌మ్ముతారు. మ‌రి ఇప్పుడు ఆ కార‌ణంగా ప‌వ‌న్ తో ప‌ని చేసే ఇత‌ర‌ ద‌ర్శ‌కుల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయా? అంటే అవున‌నే గుస‌గుస‌ వినిపిస్తుంది. బాలీవుడ్ సినిమా `పింక్` చిత్రాన్ని `వ‌కీల్ సాబ్` టైటిల్ తో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శ‌క‌త్వం వ‌హించింది వేణు శ్రీరామ్. కానీ క‌థ‌లో మార్పులు చేర్పులు చేసింది త్రివిక్ర‌మ్ అని ప్ర‌చారం ఉంది. కారణాలు ఏవైనా ఆ సినిమా మంచి స‌క్సెస్ అయింది.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. సాగ‌ర్ చంద్ర‌ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల‌యాళ సినిమా `అయ్య‌ప్పనం కోషియ‌మ్`ని `భీమ్లా నాయ‌క్` టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విష‌యంలో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌కుడిగా డైలాగ్ రైట‌ర్ గా కొన‌సాగుతున్నారు. వ‌కీల్ సాబ్ విష‌యంలో పైపైన ట‌చ‌ప్ లే కాబ‌ట్టి పేరు వేసుకోక‌పోయినా `భీమ్లా నాయ‌క్` కి మాత్రం ద‌ర్శ‌క‌త్వ‌ ప‌ర్య‌వేక్ష‌కుడు కం రైట‌ర్ గా ట్యాగ్ ఉంది. దీంతో పేరుకే సాగ‌ర్ చంద్ర వెనుకుండి క‌థ న‌డిపించేది అంతా త్రివిక్ర‌మ్ అనే ప్ర‌చారం జోరుగానే సాగుతోంది. సాగ‌ర్ చంద్ర ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు కాబ‌ట్టి త్రివిక్ర‌మ్ బ్యాకెండ్ స‌పోర్ట్ నివ్వ‌డం చెప్పుకోద‌గ్గ‌దే.

తాజాగా మాట‌ల మాంత్రికుడు మ‌రో అడుగు ముందుకేసి ఏకంగా క్రియేటివ్ మేక‌ర్ క్రిష్ స్టోరీలోనూ.. స‌న్నివేశాల్లోనే ఫింగ‌రించే చేస్తున్నార‌న్న టాక్ బ‌హిరంగంగానే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క్రిష్ ద‌ర్శక‌త్వంలో `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` అనే పీరియాడిక్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భారీ పోరాట స‌న్నివేశాలు ఉన్నాయి. భార‌త‌దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాల‌న‌కు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ క్యారెక్ట‌రైజేష‌న్ సాగుతుంది. స‌ముద్ర మార్గం ద్వారా చొర‌డ‌బ‌డిన కంపెనీ ప్ర‌తినిధులుపై దండెత్తే క్ర‌మంలో పీకే పాత్ర బ్రిటీష్ `లా` ప్ర‌కారం చ‌ట్ట విరుద్ధంగానూ సాగుతుంది. అత‌డిపై బంధిపోటు అన్న ముద్ర వేస్తారు. అయితే ఈ స‌న్నివేశాల విష‌యంలో ప‌వ‌న్ అసంతృప్తిగా ఉన్నార‌ని... ఆ కార‌ణంగా కొన్ని మార్పుల బాధ్య‌త‌ల్ని త్రివిక్ర‌మ్ కి అప్ప‌గించిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

క్రిష్ ఉన్న‌ది ఉన్న‌ట్లు వాస్త‌వాలు చూపించే ప్ర‌య‌త్నం చేస్తారు. ఆయ‌న రియాల్టీ మిస్ అవ్వ‌డానికి ఒప్పుకోరు. ఈ నేప‌థ్యంలో మరి ప‌వ‌న్ పాత్ర లో నెగిటివ్ యాంగిల్ ని పాజిటివ్ గా మార్చాల‌ని దానికి లాజిక్ వెత‌కాల‌ని త్రివిక్ర‌మ్ ని దించుతున్నారా? అన్న సందేహం క‌లుగుతోంది. కార‌ణాలు ఏవైనా! క్రిష్ స్కిప్ట్ లో మ‌రో ద‌ర్శ‌కుడు వేలు పెట్ట‌డం అంటే క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ త‌లెత్తేందుకు ఆస్కారం ఇవ్వ‌డ‌మేన‌న్న గుస‌గుస వినిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ స్క్రిప్ట్ విష‌యంలో క్రిష్ ఎప్పుడూ రాజీ ప‌డింది లేదు. బాలీవుడ్ లో `మ‌ణిక‌ర్ణిక` స్క్రిప్ట్ విష‌యంలో కంగ‌న ర‌నౌత్ ఇలాగే ఫింగ‌రింగ్ చేస్తే ఆ చిత్రాన్ని వ‌దిలేసి బ‌య‌ట‌కొచ్చేసారు క్రిష్. మ‌రి `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` విష‌యంలో త్రివిక్ర‌మ్ పాత్ర ఎంత‌వ‌ర‌కూ అన్న‌దానికి కాల‌మే స‌మాధాన‌మివ్వాలి. క్రిష్ అంగీకారంతోనే మాయావి బ‌రిలో దిగితే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అండ‌ర్ స్టాండింగ్ గా ప‌రిగ‌ణించాలి.