Begin typing your search above and press return to search.
#PSPK 26 పాటకు త్రివిక్రమ్ ఫిదా.. బుట్ట బొమ్మ రేంజా?
By: Tupaki Desk | 3 March 2020 4:00 PM ISTఆయన మాటలు కనికట్టు.. ఆయన పదాలు ఎన్నో మెదళ్లకు సిగపట్టు.. ఆయనెవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాటల మాంత్రికుడు.. పుస్తకాల పురుగు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం అల వైకుంఠపురంలో.. సంక్రాంతి బరిలో నిలిచి దుమ్మురేపింది. అటు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఇటు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ పోటీలో ఉన్నా అల క్లాసిక్ హిట్ గా నిలపడంలో త్రివిక్రమ్ స్టైల్ దే పై చేయి అయ్యింది. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలంటే ప్రధానంగా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సినిమా విడుదలకు ముందే వచ్చిన పాటలు కుర్రకారును ఉర్రూతలూగించాయి. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ తో టాప్ పొజిషన్ లో నిలిచాయి. ఇప్పటికీ అందరి నోళ్లలో ఈ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ సాంగ్ అయితే ఇక దిమాక్ ఖరాబ్ చేసేసింది. ఈ పాటలో ట్యూన్స్‌గానీ.. పాట చిత్రీకరణగానీ సూపర్ డూపర్ అన్న ప్రశంస దక్కింది. ఇక పాటల్లో సాహిత్యం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ఇంతగా పాటల్లో సాహిత్యాన్ని విన్నది లేదని సినీ వర్గాలతోపాటు సినీ ప్రేమికులు కూడా ఫిదా అయిపోయారు.
అయితే ఈ సినిమాలో పాటలు ఇంతగా అలరించడానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంచుకున్న పాటల రచయితలు. ఆయన ఇన్ పుట్స్ అనడంలో ఎలాంటి అనుమానం లేదని ఆయన అభిమానులు కుండబద్దలు కొడుతున్నారు. ఎందుకంటే ఆయనకు సాహిత్యంపై అపారమైన పట్టు ఉంది. ఈ విషయం ఆయన గత సినిమాల్లోనూ అర్థమవుతుంది.
ఇకపోతే అల వైకుంఠపురంలో .. బుట్ట బొమ్మ బొమ్మ పాటను సీనియర్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ పాటలో పదాలతో ఆయన పదనిసలు చేశారని సాహితీ ప్రియులే ఒప్పుకుంటున్నారు. తాజాగా రామ్ జొ ట్విట్టర్ లో స్వయంగా ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ``త్రివిక్రమ్ గారు నిన్న ఒక పాట వింటూ ఇది రామ్ జోది కదా అని గుర్తు పట్టారంట. సంతోషం అనిపించింది. నిలిచిపోయే పాట అవుతుందని చెప్పారు ఆయన... నిజంగానే`` అంటూ ట్వీట్ చేశారు.
అయితే ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మనసుదోచిన ఆ పాట ఏ చిత్రంలోనిది? అంటే.. అల వైకుంఠపురములో పాట కాదు. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ (pspk26) చిత్రంలోనిదేనని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఆ పాట ఎప్పుడు వింటామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ జొ గారు కూడా కొన్ని రోజులుగా ఈ సినిమా పాట కోసం కొన్ని హింట్లు ఇస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఫాలో అవుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం తెగ ఖుషీ అయిపోతున్నారు. అదే సమయంలో మాటల మాంత్రికుడు కూడా ఈ పాటకు ఫిదా అయిపోనట్లు ప్రకటించడంతో ఇక పవన్ కల్యాణ్ అబిమానుల ఆనందానికి అవధులే లేవ్. అన్నట్టు త్రివిక్రమ్ ఫిదా అయ్యారు సరే కానీ రా.జో శాస్త్రి గారు బుట్ట బొమ్మ రేంజు పాటనే రాశారా?