Begin typing your search above and press return to search.

పవన్ సినిమా కోసం కళ్లు చెదిరే సెట్టింగ్

By:  Tupaki Desk   |   30 March 2017 11:30 AM IST
పవన్ సినిమా కోసం కళ్లు చెదిరే సెట్టింగ్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ సెట్టింగ్ లేకుండా ఉండదు. పవన్ ను పెట్టుకుని మామూలు జనాల మధ్య షూటింగ్ చేయడం అంటే.. అంతకు మించిన తలనొప్పి వ్యవహారం ఇంకోటి ఉండదు. అందుకే రియల్ లొకేషన్ల జోలికి వెళ్లడానికి ఎవ్వరూ సాహసించట్లేదు. సాధ్యమైనంత వరకు సెట్టింగులతో లాగించేయడానికే చూస్తున్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’.. ‘కాటమరాయుడు’ సినిమాలకు ఏకంగా విలేజ్ సెట్టింగ్స్ వేసేశారు. ఇక త్రివిక్రమ్ కొత్త సినిమాకు కూడా ఇలాగే చేస్తున్నారట. ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

త్రివిక్రమ్ సినిమా తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో సాగుతుందట. ఇందులో హీరో తండ్రికి ఇద్దరు భార్యలుంటారట. అతను అన్నీ రెండేసి ఉండేలా చూసుకుంటాడట. ఇల్లు.. ఆఫీస్.. అన్నీ కూడా ఒకేలా రెండేసి ఉండేలా ప్లాన్ చేసుకుంటాడట. ఐతే ఒకేలా ఉండే రెండు ఇళ్లు.. ఆఫీసుల్ని పక్క పక్కన చూపించడం కష్టం కాబట్టి అందుకోసం భారీ సెట్టింగ్స్ వేస్తున్నట్లు సమాచారం. సినిమా మేజర్ పార్ట్ ఇక్కడే షూట్ చేస్తారట. పవన్ ఇందులో తండ్రికి రెండో భార్య కొడుగ్గా కనిపిస్తాడని సమాచారం. ఇదొక రివెంజ్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సినిమాను హై క్వాలిటీతో నిర్మిస్తారట. ప్రొడక్షన్ కాస్ట్.. పారితోషకాలు కలుపుకుంటే బడ్జెట్ రూ.100 కోట్లు దాటేస్తున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/