Begin typing your search above and press return to search.
నా సినిమాల్లో ఆ సీన్స్ ఉండవు : త్రివిక్రమ్
By: Tupaki Desk | 30 Oct 2018 11:00 PM IST‘అజ్ఞాతవాసి’ చిత్రంతో చాలా కాలం తర్వాత నిరాశ పర్చిన త్రివిక్రమ్ మళ్లీ గోడకు కొట్టిన బంతి మాదిరిగా ‘అరవింద సమేత’ చిత్రాన్ని అద్బుతమైన టేకింగ్ - మంచి కథ - కథనంతో తెరకెక్కించి సూపర్ హిట్ చేశాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ను ఇచ్చి నందమూరి ఫ్యాన్స్ కు దసరాకు పెద్ద కానుక ఇచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమాకు సిద్దం అవుతున్న త్రివిక్రమ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.
తనకు మాటల మాంత్రికుడు అంటూ ఎవరైనా పిలిస్తే అస్సలు నచ్చదని - పంచ్ డైలాగ్స్ బాగా రాస్తావని ఎవరైనా అన్నా కూడా ఇష్టముండదు అంటూ చెప్పుకొచ్చిన త్రివిక్రమ్ తన సినిమాల్లో పిల్లలను ఇబ్బంది పెట్టే సీన్స్ - పిల్లలు ఏడ్చే సీన్స్ - రేప్ సీన్స్ అస్సలు ఉండవని - తన సినిమాల్లో అలాంటి సీన్స్ ఎప్పుడు పెట్టాలనుకోను. ఇతరుల సినిమాల్లో అయినా పిల్లలు ఏడుస్తున్నారు అంటే నాకు ఆ సినిమా చూడాలనిపించదు. పిల్లల విషయంలో నేను చాలా సెన్సిటీవ్ అంటూ త్రివిక్రమ్ పేర్కొన్నాడు.
‘అత్తారికింటికి దారేది’ సినిమాలో ఒక సీన్ లో పిల్లాడి తల్లి చనిపోయినట్లుగా చూపించాలి. ఆ సమయంలో అతడు ఏడిస్తే బాగుంటుందని అంతా అన్నారు. కాని నేను మాత్రం వర్షం ఎఫెక్ట్ పెట్టాను - పిల్లాడు ఏడవకుండానే ఆ సీన్ ను ఫీల్ తెచ్చాను అన్నాడు. ఇక ఆడవారిని రేప్ చేసే సీన్స్ కూడా నా సినిమాల్లో ఉండవు. ఆడవారు - పిల్లలను గౌరవించేలాగే తన సినిమాలు ఉంటాయని - భవిష్యత్తులో తాను చేయబోతున్న సినిమాలు కూడా అలాగే ఉంటాయి. నయనతార నటించిన ‘కర్తవ్యం’ సినిమా చాలా బాగుందని అంతా అంటే చూడాలనుకున్నాను. సినిమా చూసిన మొదటి పదిహేను నిమిషాల్లో పాప బోరు బావిలో పడుతుంది. దాంతో నాకు సినిమా చూడాలనిపించలేదు అంటూ తన సున్నిత మనస్థత్వం గురించి త్రివిక్రమ్ వివరించాడు.