Begin typing your search above and press return to search.
ఒకే సినిమాతో ఇద్దరు హీరోల కమిట్మెంట్స్ పూర్తి చేస్తాడా...?
By: Tupaki Desk | 10 Oct 2020 11:11 PM ISTత్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో హ్యాట్రిక్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'అతడు' సినిమా సక్సెస్ సాధించగా.. 'ఖలేజా' ప్లాప్ అయింది. అయినప్పటికీ త్రివిక్రమ్ మహేష్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించాడని చెప్పవచ్చు. అందుకే వీరి కలయికలో మరో సినిమా రావాలని అభిమానులు కూడా కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల మహేష్ బాబు ట్వీట్ చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అతి త్వరలో సినిమా ఉంటుందని ప్రకటించాడు. మహేష్ నుంచి ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమా గురించి అప్పుడే సినీ జనాల్లో డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి.
మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ఓ మల్టీస్టారర్ అని ప్రచారం జరుగుతోంది. ఈ జనరేషన్ స్టార్ హీరోల్లో మల్టీస్టారర్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన మహేష్.. మరోసారి మల్టీస్టారర్ చేయబోతున్నాడట. అది కూడా విక్టరీ వెంకటేష్ తో అంటున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో మహేష్ - వెంకటేష్ లు కలిసి చిన్నోడు - పెద్దోడు గా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబోని త్రివిక్రమ్ మరోసారి వెండితెరపైకి తీసుకురానున్నాడట. ఇప్పటికే వెంకటేష్ తో ఓ సినిమా చేస్తానని కమిట్మెంట్ ఇచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు మహేష్ సినిమాలో వెంకటేష్ ని కూడా జాయిన్ చేస్తున్నాడట. అంటే ఒకే సినిమాతో త్రివిక్రమ్ ఇద్దరు హీరోలతో ఉన్న కమిట్మెంట్స్ పూర్తి చేయనున్నాడన్నమాట. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.