Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ స్క్రిప్ట్ అదే అయితే.. రాజమౌళి పరిస్థితేంటి..?
By: Tupaki Desk | 2 May 2021 8:00 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లాక్ డౌన్ టైంలో 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత సినిమా మహేష్ తోనే అని క్లారిటీ ఇచ్చాడు. మహేష్ తో జేమ్స్ బాండ్ లేదా సీక్రెట్ ఏజెంట్ తరహా సినిమా చేస్తే బాగుంటుందని రాజమౌళి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త సినిమా ప్రకటించడంతో ఆ టైపు పాత్రతో రాజమౌళి సినిమా చేసే ఛాన్స్ లేదని టాక్ నడుస్తోంది.
మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా '#SSMB28' అనౌన్సమెంట్ వచ్చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని మేకర్స్ వెల్లడించారు. త్రివిక్రమ్ ఇందులో మహేష్ బాబు క్యారెక్టర్ ని కొత్తగా డిజైన్ చేసారని.. ఆయన సీక్రెట్ ఏజెంట్ గా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే రాజమౌళి అదే తరహా పాత్రతో సినిమా చేయకపోవచ్చు. దీంతో కొత్త లైన్ తీసుకొని స్టోరీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది.