Begin typing your search above and press return to search.
మా కష్టం మాటల్లో చెప్పలేం: త్రివిక్రమ్
By: Tupaki Desk | 30 Oct 2018 7:00 AM ISTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఓ ఇంటర్య్వూలో భాగంగా సినిమా కష్టాలను గురించి చెప్పుకొచ్చాడు. దర్శకుడు మొదటగా కథ రాసుకున్నట్టుగా అన్ని సార్లు మంచి అవుట్ పుట్ రాదని - ఎలాంటి అంశాలపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. దర్శకుడు కథ రాసుకున్నాక అది కెమెరామెన్ - నటీనటులను దాటుకుని ఆ తర్వాత అనేక లేయర్లను దాటాల్సి వస్తుంది. ఈ సమయంలో ఏదైనా తేడా వస్తే ఫలితం రివర్స్ అవుతుంది. ఏ దర్శకుడు అయినా విజయాన్ని దక్కించుకునేలా కథ రాస్తాడు కానీ దాన్ని తెరకెక్కించడంలో జరిగే లోటు పాట్ల వల్ల ఫలితం ఉంటుంది. ఎర్రని తెర ముందు హీరో నల్లని షర్ట్ వేసుకుని డైలాగు చెప్పాలని దర్శకుడు భావిస్తాడు. కానీ రెడ్ లో అనేక షేడ్స్ ఉంటాయి. వాటిలో ఏది బెడిసి కొట్టినా కూడా ప్రభావం పడుతుంది.
ఒక రంగులోనే అన్ని షేడ్స్ ఉండడంతో ప్రతి చిన్న అంశాన్ని కూడా భూతద్దంలో చూపినంత క్లారిటీ కావాలి - కానీ అన్ని సార్లు అలా చేయలేం. మరీ ఇంత క్లారిటీ మెయిన్ టెయిన్ చేసే దర్శకుడు ఆ తర్వాత కూడా చాదస్తం పాటిస్తాడు. అది ఎంతలా అంటే ఒక గ్లాసు వాటర్ కావాలంటే... గాజు గ్లాసులో - సగం కంటే ఎక్కువగా - గది ఉష్ణోగ్రత కంటే తక్కువగా - గ్లాసు కింద నుండి పట్టుకుని తీసుకురా అనేంత క్లారిటీ అవసరం. సినిమా తెరకెక్కించడం అంటే హాయిగా కూచుని చూస్తు ఉండడం కాదు అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.
సినిమా తెరకెక్కించడంలో ఎవరికి పర్ ఫెక్షన్ ఉండదని - కాకపోతే తప్పుల్ని నివారించడంలో ఉండే ప్రతిభని బట్టి విజయాలు సొంతమవుతాయి. సీన్ వివరించే సమయంలో చాలా క్లారిటీ అవసరం. వాటిని ఓపిగ్గా వినిపించి - ఆ తర్వాత రాసుకున్న విధంగా తెరకెక్కించేలా ప్రయత్నం చేయాలి. కానీ అన్ని సార్లు అవుట్ పుట్ అనుకున్న విధంగా రాదు - ఈ విధంగా మా కష్టాలు మాటల్లో చెప్పలేం అంటూ త్రివిక్రమ్ దర్శకుల శ్రమను గురించి చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ చిత్రం తాజాగా విడుదలయ్యి మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.