Begin typing your search above and press return to search.

టైటిల్ ఛాయిస్ త్రివిక్రమ్ దే

By:  Tupaki Desk   |   25 May 2018 4:21 AM GMT
టైటిల్ ఛాయిస్ త్రివిక్రమ్ దే
X
ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆ మూవీ డైరెక్టర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇంటా.. బయటా తీవ్ర విమర్శలొచ్చాయి. దీని తరవాత ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా టైటిల్ తో పాటు ఎన్టీఆర్ లుక్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇందులో మాస్ గెటప్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది.

అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడంతో ఎన్టీఆర్ ఈ సినిమాపై ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని టాలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. ముందు ఈ మూవీ టైటిల్ అరవింద సమేత మాత్రమే త్రివిక్రమ్ ఐడియా అని.. కింద వీరరాఘవ అని చిన్న అక్షరాల్లో పెడుతూ ఈ టైటిల్ ను డిజైన్ చేయించాలంటూ ఎన్టీఆర్ గట్టిగా పట్టుపట్టాడనే మాట వినిపించింది. అయితే ఇవన్నీ తప్పు మాటలేనని.. ఈ సినిమా టైటిల్ పూర్తిగా త్రివిక్రమ్ ఐడియానే అని సినిమా యూనిట్ సభ్యుడొకరు తెలిపారు. అరవింద సమేత వీర రాఘవ టైటిల్ ఎందుకు పెట్టాలన్న దానిపై త్రివిక్రమ్ క్లారిటీగా ఉండటంతో ఎన్టీఆర్ ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది.

త్రివిక్రమ్ కెరీర్ లో ఫ్లాపులు ఉన్నప్పటికీ అవేవీ అజ్ఞాతవాసి అంత నష్టాన్ని చేయలేదు. అందుకే ఈసారి హిట్ సినిమా కొట్టి తానేంటో నిరూపించుకోవాలన్న పంతంతో త్రివిక్రమ్ ఉన్నాడు. స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ పై ఉన్న నమ్మకంతో ఎన్టీఆర్ కూడా అతడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లిపోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడని టాక్. అరవింద సమేతలో త్రివిక్రమ్ యాక్షన్ ఎపిసోడ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి అవి సినిమాకు హైలైట్ గా నిలిచేలా తెరకెక్కిస్తున్నాడని తెలిసింది.