Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్‌.. ఫ్రెండ్‌ తో ఫైటింగ్ తప్పదేమో

By:  Tupaki Desk   |   28 April 2016 7:23 PM IST
త్రివిక్రమ్‌.. ఫ్రెండ్‌ తో ఫైటింగ్ తప్పదేమో
X
సినిమా అంతా జాగ్రత్తగా తీయడం ఒకెత్తయితే.. యావరేజ్‌ స్టార్ డమ్‌ మాత్రమే ఉన్న నితిన్‌ వంటి హీరోలకు సరైన టైమ్‌ లో సినిమాను రిలీజ్‌ చేయడం మరో ఎత్తు. ఎందుకంటే అప్పుడే కలెక్షన్లు ఫుల్లుగా వచ్చేది మరి. అందుకే ఇప్పుడు ''అ..ఆ'' సినిమా రిలీజ్‌ కోసం దర్శకుడు త్రివిక్రమ్‌ నానా కష్టాలు పడుతున్నాడు. పైగా తను కూడా తొలిసారి ఇంకా సూపర్‌ స్టార్ కాని ఒక హీరోతో సినిమా చేస్తున్నాడేమో.. ఈ రిలీజ్‌ కష్టాలు మామూలుగా లేవు.

మే 6న వస్తుంది అనుకున్న ''అ..ఆ'' సినిమాను.. ఎప్పుడు రిలీజ్‌ చేస్తోందీ ఇంతవరకు కన్ ఫామ్‌ చేయలేదు. అయితే పక్కనొచ్చే పెద్ద స్టార్ల సినిమాలను చూసుకొని రిలీజ్‌ డేట్‌ ను ఫిక్స్‌ చేద్దామని త్రివిక్రమ్‌ వెయిటింగ్‌. కాని ఇప్పటివరకు ఇంకా మహేష్‌ బాబు ''బ్రహ్మోత్సవం'' రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్సు కాలేదు. మనోళ్ళు మే 20 కాని మే 27 కాని అనుకుంటున్నారే కాని.. ఇవాళ రిలీజ్‌ చేసిన ఆడియో ప్రెస్‌ నోట్‌ లో కూడా ఎక్కడా డేటు గురించి పేర్కొనలేదు. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్‌ అండ్‌ గ్యాంగ్‌ ఒక డెసిషన్‌ కు వచ్చేశారట.

ఒకవేళ బ్రహ్మోత్సవం 27న వచ్చినా రాకపోయినా.. తమ అ..ఆ..లు మాత్రం 27న దిద్దుకుందాం అని పంపిణీదారులతో సమావేశం పెట్టాడు త్రివిక్రమ్‌. ఆయనతోపాటే నిర్మాత రాధాకృష్ణ కూడా కూర్చొని.. ఈ డేటును ఖరారు చేసే యోచనలో ఉన్నారు. మరి గుడ్‌ ఫ్రెండ్‌ మహేష్‌ తో త్రివిక్రమ్‌ కు ఫైటింగ్‌ తప్పదయితే.