Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' విషయంలో క్లారిటీ ఇచ్చిన త్రివిక్రమ్!

By:  Tupaki Desk   |   23 Nov 2021 3:59 AM GMT
భీమ్లా నాయక్ విషయంలో క్లారిటీ ఇచ్చిన త్రివిక్రమ్!
X
త్రివిక్రమ్ కి మంచి నాలెడ్జ్ ఉందనే విషయం ఆయనతో మాట్లాడే ప్రతి ఒక్కరికీ అర్థమైపోతూనే ఉంటుంది. ఒక వైపున తన సినిమాలకి సంబంధించిన పనులతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన, ఏ మాత్రం ఖాళీ దొరికినా పుస్తకాలు బాగా చదువుతూ ఉంటారు. అందువలన ఆయనకి తెలుగు సాహిత్యం మీద మంచి పట్టు ఉంది. పవన్ కల్యాణ్ ను పుస్తకాల వైపు మళ్లించింది త్రివిక్రమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. తాజాగా ఆయన ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.

అక్కడున్న యువతను గురించి ఆయన ఈ వేదికపై మాట్లాడారు. "చదువు తాలూకు బేసిక్ క్వాలిటీ ఏమిటంటే క్వశ్చన్ చేయడం .. ప్రశ్నించడం. కాబట్టి ఎప్పుడూ సరెండర్ కావొద్దు. కష్టానికి .. జీవితానికి .. మనుషులకు .. అధికారానికి .. డబ్బుకు దేనికి కూడా సరెండర్ కావొద్దు. ఎప్పుడూ కూడా క్వశ్చన్ చేయండి. జీవితంలో మీరు ఒక సారి బాగా వెనక్కి వెళ్లండి. ఇప్పుడు మీరు ఎంత సక్సెస్ ఫుల్ అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు మీ ఎవరికీ కూడా 'అమ్మ' అనడం రాదు .. 'అత్త' అనడం రాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏబీసీడీలు కూడా రావు.

కానీ ఇప్పుడు మీరంతా పెద్ద పెద్ద బుక్కులు చదువుతున్నారు. అంటే చాలా సక్సెస్ అయినట్టేగదా? జీవితంలో మీరు ఏదైతే కావాలను అనుకుంటున్నారో దానినే కంటిన్యూగా చేస్తూ వెళ్లండి. ఒక్క ఆదివారం వచ్చినప్పుడు తప్ప .. పండుగలు వచ్చినప్పుడు తప్ప ఇప్పుడు స్కూల్లో ఎలా చదువుతున్నారో అలాగే చదవండి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ .. ఏదీ ఆపలేదు. కానీ ఒకటి .. సరెండర్ కాకండి .. క్వశ్చన్ చేయడం నేర్చుకోండి .. ఎవరినైనా సరే.

అమ్మకీ .. నాన్నకి .. దేవుడికి ..మనకి విద్య నేర్పినవారికి ప్రతిరోజూ నమస్కారం చేయండి. ప్రతి రోజూ చాలా కృతజ్ఞతతో ఉండాలి .. ఆనందంతో ఉండాలి .. సంతోషంగా ఉండాలి" అని చెప్పుకొచ్చారు. 'భీమ్లా నాయక్' గురించి రెండు మాటలు మాట్లాడమని అక్కడివారు పట్టుబట్టారు. ఈ సినిమాకి ఆయన స్క్రీన్ ప్లే - సంభాషణలు సమకూర్చిన సంగతి తెలిసిందే. అక్కడివారి కోరిక మేరకు, ఆయన మళ్లీ మైక్ అందుకుని .. "సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందాక అక్కడి నుంచే వచ్చాను. బాగా చదవండి .. ఖాళీ సమయంలో సినిమా చూడండి. బీ సేఫ్ .. స్టే సేఫ్ .. ఆల్ ది బెస్ట్" అని చెప్పుకొచ్చారు.