Begin typing your search above and press return to search.

పవన్ - త్రివిక్రమ్ సినిమాలో కొత్త అత్త!

By:  Tupaki Desk   |   3 Nov 2016 9:28 AM IST
పవన్ - త్రివిక్రమ్ సినిమాలో కొత్త అత్త!
X
టాలీవుడ్ లో మాస్ హీరోలకు వారి సరసన నటించే హీరోయిన్లపై ఎంత ఆసక్తి ఉంటుందో... వారి అత్తలపై కూడా అదేస్థాయిలో ఆసక్తి ఉంటుందనే చెప్పాలి. పొగరుబోతు పిల్లకే కాదు - పొగరున్న అత్తకు కూడా తెరపై హీరో గట్టిగా బుద్ది చెబితే థియేటర్లల్లో విజిల్సే విజిల్సే. అయితే ఇలా బుద్ది చెప్పే కార్యక్రమంలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. తివిక్రం దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్తను ఎలా ఒప్పించి - మెప్పించారనేది కీలకాంశం. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ సినిమాలో హీరోయిన్స్ కంటే... పవన్ కళ్యాణ్ కి - అత్త నదియాకే ఫుల్ పేరు వచ్చింది. ఇదే క్రమంలో మరో సారి పవన్ సినిమాలో అత్త క్యారెక్టర్ తాజాగా తెరపైకి వచ్చింది.

టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ లలో ఒకటైన పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ లు వరుసగా జల్సా - అత్తారింటికి దారేది చిత్రాలతో సూపర్ హిట్స్ సాధించారు. ఇదే క్రమంలో హ్యాట్రిక్ పై కన్నేసిన ఈ కాంబినేషన్... ఇప్పుడు మూడో మూవీకి రెడీ అవుతుంది! దాంతో... ఈ కాంబోపై టాలీవుడ్ లో భారీ అంచనాలు మొదలయ్యాయి. దీంతో మరోసారి పవన్ తో చేయబోయే మూవీ ఫ్యామిలీ కం కామెడీ జానర్ లోనే తెరకెక్కిస్తాడట త్రివిక్రమ్. అయితే ఈ మూవీలో ఓ క్యారెక్టర్ కోసం సీనియర్ నటి ఖుష్బూని తీసుకున్నారని వార్తలొస్తున్నాయి. సాదారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో కొత్త కొత్త కాంబినేషన్లు సెట్ అవుతూ ఉంటాయి - అవి కూడా ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అత్తారింటికు దారేది సినిమాలో పవన్ కి అత్తగా నదియాని తీసుకున్న త్రివిక్రమ్... లేటెస్ట్ సినిమాలో ఖుష్బూ ని కూడా ఆ స్థాయి పాత్రలో తీసుకోనున్నరని సమాచారం. ఈ సినిమాతో కుష్బూ కూడా భారీ రీఎంట్రీ ప్లాన్ ఆశిస్తుందట. ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/