Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ .. మహేశ్ ప్రాజెక్టుకి సంక్రాంతి ముహూర్తం!

By:  Tupaki Desk   |   6 Nov 2021 11:03 AM IST
త్రివిక్రమ్ .. మహేశ్ ప్రాజెక్టుకి సంక్రాంతి ముహూర్తం!
X
మహేశ్ బాబు తన సినిమాల విషయంలో పక్కా ప్లానింగుతో ఉంటాడు. సాధ్యమైనంతవరకూ ఆ ప్లానింగులో మార్పు రాకుండా చూసుకుంటాడు. ఒకసారి తాను ఓకే అనేసిన తరువాత కథలోగానీ .. సీన్స్ విషయంలోగాని ఎక్కడా చిన్న మార్పు జరిగినా ఆయన ఒప్పుకోడు. అన్నివైపుల నుంచి తనకి పూర్తి క్లారిటీ వస్తేనే ఆయన రంగంలోకి దిగుతాడు. కొంతకాలంగా ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తూ వచ్చాడు. కరోనా కారణంగా కాస్త ఆలస్యమైన ఈ సినిమా, రీసెంట్ గా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

ఒకసారి ఎడిట్ వెర్షన్ చూసుకుని .. ప్యాచ్ వర్క్ ఏమైనా ఉంటే అది కూడా పూర్తి చేసేస్తారట. ఈ సినిమాకి సంబంధించిన ఏ పనులైనా డిసెంబర్ లోగా పూర్తిచేయమని పరశురామ్ తో మహేశ్ ఆల్రెడీ చెప్పేశాడట. ఎందుకంటే సంక్రాంతి నుంచి ఆయన కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. మహేశ్ బాబు తదుపరి సినిమా త్రివిక్రమ్ తో ఉండనుంది. అందుకు సంబంధించిన పనులతోనే ప్రస్తుతం త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ ను రెడీగా ఉంది. మహేశ్ బాబుదే ఆలస్యం .. ఆయన కోసమే త్రివిక్రమ్ వెయిట్ చేస్తున్నాడు.

హీరో వచ్చేలోగా ఆయన కాంబినేషన్ లేని సన్నివేశాలను లాగించేద్దామనే అలవాటు త్రివిక్రమ్ కి లేదు. హీరో .. హీరోయిన్లతోనే తన సినిమా ఫస్టు షెడ్యూల్ మొదలయ్యేలా ఆయన చూసుకుంటాడు. అందువల్లనే ఆయన మహేశ్ వచ్చేవరకూ వెయిట్ చేస్తున్నాడు. 'అతడు' సినిమా నుంచి త్రివిక్రమ్ కీ .. మహేశ్ బాబుకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. మహేశ్ బాబు కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాల్లో అది ఒకటి. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైతే మంచి రేటింగ్ వస్తుందటే, ఈ సినిమా కథాకథనాలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు మూడో సినిమా రాబోతోంది. అందువలన అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఇది కూడా తన మార్క్ కి దూరంగా వెళ్లకుండా త్రివిక్రమ్ చేస్తున్న సినిమా. ఆయన హీరో పాత్ర స్వభావంలో కొత్తదనాన్ని చూపిస్తాడే తప్ప .. హీరోలను డిఫరెంట్ లుక్స్ తో చూపించే ప్రయత్నం చేయడు. మహేశ్ బాబు కూడా అంతే .. తన లుక్ లో సింపుల్ గా ఉండే ఛేంజెస్ తప్ప ఓవర్ గా ఉంటే ఒప్పుకోడు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. గతంలో ఈ ఇద్దరితో కలిసి పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. సంక్రాంతికి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందన్న మాట.