Begin typing your search above and press return to search.

శత్రువుతో మిత్రత్వం కోరుకుంటోంది

By:  Tupaki Desk   |   28 July 2015 1:02 PM IST
శత్రువుతో మిత్రత్వం కోరుకుంటోంది
X
క్యూట్‌ త్రిష రాజకీయారంగేట్రం చేస్తోందంటూ కోలీవుడ్‌ లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తిరోగమనంలో ఉన్న కెరీర్‌ ని గాడిలో పెట్టి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనుకున్న టైమ్‌ లో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. జయలలిత అభిమానిగా అన్నా డీఎంకే తీర్థం పుచ్చుకుంటోందని ప్రచారమైంది. అయితే ఇదే ప్రశ్న త్రిష ముందు ఉంచినప్పుడు.. దానికి తెలివైన సమాధానమే ఇచ్చింది.

నాకు రాజకీయాలపై 40శాతం అవగాహన ఉంది. వాటిలోకి వెళుతున్నా అన్న ఆలోచన బాగానే ఉంది .. కానీ ఇది సరైన టైమ్‌ కాదు. ఇప్పటికే ఐదు సినిమాల్లో నటిస్తున్నా. కెరీర్‌ పరంగా పూర్తి బిజీ. మరికొన్ని అవకాశాలు నా వెంట వస్తున్నాయి. ఇలాంటి టైమ్‌ లో ఎలా కుదురుతుంది? అని ప్రశ్నించింది.

అంతేనా మీ శత్రువు నయనతారతో కలిసి నటిస్తారా? అన్న ఓ ప్రశ్నకు .. నయన్‌ నాకు స్నేహితురాలు. మేం ఇద్దరం కలిసి గతంలోనే నటించాల్సింది. కొందరు ప్రయత్నించినా ఎందుకనో కుదరలేదు. మన్‌ కథ తర్వాత వెంకట్‌ ప్రభు మా ఇద్దరితో కలిసి ఓ సినిమా చేయాలని ప్లాన్‌ చేశాడు. అది త్వరలోనే సాధ్యపడేట్టే కనిపిస్తోంది. నయన్‌ తో కలిసి ఎప్పటికైనా నటిస్తాననని ఘంటాపథంగా చెప్పింది అమ్మడు.