Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ తో మరో అవకాశంకు 14 ఏళ్ల వెయిట్‌ చేసింది

By:  Tupaki Desk   |   20 Sep 2022 11:30 AM GMT
సూపర్‌ స్టార్‌ తో మరో అవకాశంకు 14 ఏళ్ల వెయిట్‌ చేసింది
X
కోలీవుడ్‌ సూపర్ స్టార్‌ విజయ్‌ ప్రస్తుతం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వారసుడు సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. హీరో విజయ్ తన సినిమాకు సినిమాకు అసలు ఎక్కువ గ్యాప్ ఉండనివ్వడు. వారసుడు సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే రిలీజ్ కోసం వెయిట్‌ చేయకుండా మరో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

విక్రమ్‌ సినిమా తో ఇండస్ట్రీ హిట్‌ ను దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి సినిమా ను మొదలు పెట్టబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు అయ్యింది.

తాజాగా తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ కి జోడీగా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారట... అందులో ఒక హీరోయిన్ గా త్రిష ఎంపిక అయ్యిందట.

త్రిష ఈ సినిమాలో ఎంపిక అయ్యిందనే విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ త్వరలోనే ఆ విషయమై అధికారికంగా ప్రకటన వస్తుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. విజయ్ తో త్రిష గతంలో నటించింది. అది రెండు మూడు ఏళ్ల క్రితం కాదు.. ఏకంగా 14 ఏళ్ల క్రితం విజయ్‌ కి జోడీగా త్రిష నటించింది. వీరిద్దరి కాంబో కోసం ఈ 14 ఏళ్లు గా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

విజయ్ తో సినిమా కోసం దాదాపుగా 14 ఏళ్ల నుండి త్రిష ఎదురు చూస్తూనే ఉంది. ఎంతో మంది హీరోలతో మళ్లీ మళ్లీ ఆఫర్లు దక్కించుకుంది కానీ విజయ్ తో ఒకటి రెండు సార్లు ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.

సూపర్ స్టార్‌ విజయ్ తో ఏకంగా 14 ఏళ్ల తర్వాత నటించే అవకాశం రావడంతో త్రిష నో చెప్పలేదట. పాత్ర విషయంలో పట్టింపు లేకుండా ఆమె నటించేందుకు ఓకే చెప్పిందని సమాచారం. ఈ సినిమా ఇదే ఏడాది నవంబర్ లో పట్టాలెక్కే అవకాశం ఉందట.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.