Begin typing your search above and press return to search.
టిక్ టాక్ వీడియోలతో అదరగొడుతున్న సీనియర్ బ్యూటీ...!
By: Tupaki Desk | 14 Jun 2020 11:28 PM ISTసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీలలో సీనియర్ హీరోయిన్ త్రిష ఒకరు. ఈ మధ్య ఇంటికే పరిమితమైన ఈ అమ్మడు అత్యంత ప్రజాదరణ పొందిన టిక్ టాక్ యాప్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గృహ నిర్బంధాన్ని మరిచిపోయేందుకు ఈ భామ టిక్ టాక్ ను ఆశ్రయించి పొట్టి పొట్టి నిక్కర్లు ధరించి వయ్యారంగా డ్యాన్స్ చేస్తూ వీడియోలతో ఇరగదీస్తోంది. త్రిష టిక్ టాక్ వీడియోస్ ఇలా పెట్టడమే ఆలస్యం అలా వైరల్ అవుతున్నాయి. లేట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఒక మిలియన్ కి పైగా ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. లేటెస్ట్ గా అమ్మడు ఓ సాంగ్ కు టిక్ టాక్ చేసి కెమెరాని మిస్ అవుతున్నా అని వెళ్లడించింది. అయితే ఎప్పుడు పొట్టి దుస్తుల్లో దర్శనమిచ్చే త్రిష నిండైన దుస్తుల్లో కనిపించి అలరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా అమ్మడు ఇంట్లోనే ఉంటూ షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేసింది. ఇలా ఏదొక విధంగా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది త్రిష.
ఇదిలా ఉండగా త్రిష కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో దాదాపు 13 ఏళ్ళ సినీ కెరీర్ ఉన్న త్రిష టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ 'వర్షం' సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులోని సీనియర్ హీరోలు.. కుర్ర హీరోలు అని తేడా లేకుండా అందరితో నటించింది. చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలయ్య మహేష్ బాబు ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ రవితేజ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. అయితే కొన్నేళ్లుగా తెలుగులో పెద్దగా ఛాన్సెస్ తెచ్చుకోలేకపోయిన త్రిష తమిళంలో మాత్రం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా డేట్స్ క్లాస్ రావడంతో వదులుకుంది. కాగా త్రిష ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో నటిస్తోంది. అలాగే ఆమె నటించిన 'పారపాధమ్ విలయట్టు' 'గర్జనాని' 'రాంగీ' 'షుగర్' 'రామ్' లాంటి చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.