Begin typing your search above and press return to search.

మళ్లీ అంకెలు నేర్పుతున్న చెన్నై చిన్నది

By:  Tupaki Desk   |   4 Jan 2017 5:36 AM GMT
మళ్లీ అంకెలు నేర్పుతున్న చెన్నై చిన్నది
X
చెన్నై బ్యూటీ త్రిష కెరీర్ ఇప్పుడు విపరీతమైన స్పీడ్ లో ఉంది. కెరీర్ ఆఖరి స్టేజ్ కి వచ్చిందనే విమర్శలకు.. కొత్త సినిమాల అగ్రిమెంట్స్ తోనే సమాధానం చెప్పింది ఈ బ్యూటీ. ఇప్పటికే అర డజన్ పైగా కొత్త ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. వీటిలో హీరోయిన్ ఓరియెంటెడ్ ప్రాజెక్టులు కూడా ఉండడం విశేషం.

వీటిలో వెరైటీ సబ్జెక్టులు కూడా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతికి జంటగా 96 అనే వెరైటీ టైటిల్ పై ఓ చిత్రాన్ని అంగీకరించింది త్రిష. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో.. 1818 అనే టైటిల్ పై మరో చిత్రంలో ఈ చెన్నై చిన్నదానికి ఆఫర్ రావడం.. దాన్ని అంగీకరించడం కూడా జరగిపోయింది. మైండ్ డ్రామా అనే కాన్సెప్ట్ పై ఈ చిత్రం రూపొందుతుందట. రితున్ సాగర్ దర్శక నిర్మాతగా వ్యవహరినున్న ఈ మూవీనీ.. తెలుగు తమిళ భాషల్లో రూపొందించనన్నారు.

2008లో ముంబై దాడుల నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు చెబుతున్నాడు. కథనంలో ఎక్కడా స్పీడ్ తగ్గకుండా.. ఆద్యంతం ఆసక్తిగాసాగే స్క్రీన్ ప్లే ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ అంటున్నాడు రితున్ సాగర్. ఈ మూవీలో సుమన్.. రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్లు నటించనుండగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/