Begin typing your search above and press return to search.

రజినీ కోసం త్రిష ఇంత పని చేసింది!

By:  Tupaki Desk   |   28 Aug 2018 12:09 PM IST
రజినీ కోసం త్రిష ఇంత పని చేసింది!
X
టాలీవుడ్‌ - కోలీవుడ్‌ లో పుష్కర కాలంకు పైగా త్రిష స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతూనే ఉంది. ఈ అమ్మడు తెలుగులో ఈమద్య సినిమాల సంఖ్య కాస్త తగ్గించింది. ఎక్కువగా తమిళంలోనే ఈమె నటిస్తూ వస్తుంది. ఈమద్య కాలంలో తమిళంలో ఈమె నటించిన చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా రజినీకాంత్‌ కు జోడీగా ఒక చిత్రంలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న రజినీకాంత్‌ చిత్రంలో ఛాన్స్‌ దక్కడంతో ఈ అమ్మడు మరింత కాలం హీరోయిన్‌ గా కొనసాగడం ఖాయం అని తేలిపోయింది. ఈ సమయంలోనే ఈమె కొత్త లుక్‌ తో సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యింది.

త్రిష ఇప్పటి వరకు నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో లాంగ్‌ హెయిర్‌ తో కనిపించింది. అయితే ఉన్నట్లుండి ఈమె తన హెయిర్‌ ను షార్ట్‌ చేసుకుంది. ఆమద్య బిగ్‌ బాస్‌ లో తనీష్‌ కోసం దీప్తి సునయన ఎలా అయితే తగ్గించుకుందో అలాగే త్రిష కూడా తగ్గించుకుంది. సెలబ్రెటీలు తమ హెయిర్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్క సినిమా కోసం జుట్టు కట్‌ చేసుకోవడం, మరో ప్రయోగం చేసుకోవడం చేయరు. కొన్ని సీన్స్‌లలో చిన్న జుట్టుతో కనిపించాలనుకుంటే విగ్‌ ను ధరిస్తారు. కాని త్రిష నిజంగా జుట్టును కట్‌ చేయించుకోవడం చర్చనీయాంశం అవుతుంది.

ప్రస్తుతం రజినీకాంత్‌ చిత్రంలోనే కాకుండా మరో రెండు మూడు చిత్రాల్లో కూడా నటిస్తుంది. అయినా కూడా త్రిష జుట్టును ఇలా షార్ట్‌గా కట్‌ చేయించుకోవడం వెనుక కారణం ఏంటా అని ఎక్కువ శాతం జనాలు ఆలోచిస్తున్నారు. అయితే తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రజినీకాంత్‌ చిత్రంలో కొత్త హెయిర్‌ స్టైల్‌ లో త్రిష కనిపించాల్సి ఉంది. సినిమా మొత్తంలో విగ్‌ తో నటించడం కంటే ఇలా కట్‌ చేయించుకుంటే బెటర్‌ అని, ఇంత పెద్ద సాహసంకు త్రిష ఒడికట్టినట్లుగా తెలుస్తోంది. రజినీకాంత్‌ తో రాకరాక వచ్చిన ఆఫర్‌ అవ్వడంతో త్రిష ఎంతటి సాహసంకు అయినా ఓకే అంటుంది. జుట్లు ఒక లెక్కనా చెప్పండి..!