Begin typing your search above and press return to search.

ఆ పార్టీ లో త్రిష చిందులు హైలైట్

By:  Tupaki Desk   |   7 Aug 2017 11:37 AM GMT
ఆ పార్టీ లో త్రిష చిందులు హైలైట్
X
నిన్న ఆదివారం పైగా ఫ్రెండ్ షిప్ డే కావడం తో చాలమంది పార్టీలు జరుపుకున్నారు. పార్టీ జరుపుకోవడానికి ఒక సందర్భం వస్తేనే వదలని మన యూత్ ఫ్రెండ్ షిప్ డే ని ఎందుకు మిస్ చేస్తారు చెప్పండి. ఇలానే మన స్టార్లు కూడా పార్టీలుని ఫ్రెండ్స్ ని ఇష్టపడే వారు చాలానే ఉన్నారు. హీరోల పార్టీలతో పోల్చి చూస్తే హీరోయిన్లు కూడా ఈ మధ్య ఎక్కువగానే పార్టీలు జరుపుకుంటున్నారు. సౌత్ హీరోయిన్లులో ఇప్పుడు డస్కీ బ్యూటి త్రిష కి పార్టీ గర్ల్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఫ్రెండ్ షిప్ డే ని సందర్భాన్ని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొని తన ట్విటర్ లో ఆ ఫోటో లు పోస్ట్ చేసింది.

షూటింగ్లు - వర్క్ ఔట్లు అన్నీ ముగించుకొని ఆదివారం పొద్దున నుండే తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసింది. రోజులో ఒక్కో పుట ఒక్కో ఫ్రెండ్స్ గ్రూప్ ని కలిసి జాలీ గా గడిపిండి ఆదివారాన్ని. పొద్దున్న కొంతమంది ఫ్రెండ్స్ ని తన ఇంటికి పిలిచి మంచి విందు కూడా ఇచ్చింది అంటా. ఆ వెంటనే మరి కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి పబ్ కి వెళ్ళి చిందులు వేసి తన ఫ్రెండ్స్ తో కలిసి మంచి ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసింది అని తెలుస్తుంది. ఇదే విషయాన్ని తెలుపుతూ కొన్ని ఫోటోలు పెట్టింది చూడండి. ఆ ఫోటో పై శీర్షక కూడా తన ఆనందాన్ని చెప్పే విదంగా ఉంది లెండి “బెస్ట్ ఫుడ్ - బెస్ట్ ఫ్రెండ్స్ - ఫరెవర్“ అంటూ ట్వీట్ చేసింది. ఈ పార్టీలు రాత్రి వరకు చిందులు బాగానే ఉన్నాయి కానీ ఈ ఫ్రెండ్స్ పార్టీలో త్రిష అమ్మ కూడా ఉందంట. త్రిష ఫ్రెండ్స్ పార్టీ లో అమ్మ ఏమి చేస్తుందో ఎవరికి అర్ధం కావటంలేదు. బహుశా తాగి రచ్చ చేయకుండా జాగ్రతగా ఇంటికి తీసుకొని వెళ్లడానికి వచ్చిందేమో.

తెలుగులో కన్నా తమిళ్ సినిమాలు తో బిజీగా ఉన్న త్రిష కు ఆ మధ్య పెళ్లి ఫిక్స్ చేసుకొని మళ్ళీ రద్దు చేసుకుంది. త్రిష తన చిన్ననాటి స్నేహితులుతో పార్టీ బాగానే ఎంజాయ్ చేసినట్లు అనిపించిది. మరి విడుదల కాబోతున్న సినిమాలతో ఇంకా ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.