Begin typing your search above and press return to search.
మెగా రీమేక్ లో త్రిష - నయనతార..?
By: Tupaki Desk | 16 Nov 2020 2:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతూ వస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న చిరు.. మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే రచయిత ఆకుల శివ తో కలిసి వినాయక్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాడని సమాచారం. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో రామ్ చరణ్ మరియు ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ గురించి ఓ క్రేజీ రూమర్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
మలయాళ 'లూసిఫర్' లో హీరో మిడిల్ ఏజ్ క్యారక్టర్ లో కనిపించడమే కాకుండా హీరోకి జోడీగా హీరోయిన్ కూడా ఉండదు. అలానే సాంగ్స్ కూడా ఉండవు. అయితే చిరంజీవి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ లో హీరోకి భార్యతో పాటు మరో కొత్త పాత్రను డిజైన్ చేశారట. దీని కోసం దక్షిణాది అగ్ర కథానాయికలు త్రిష మరియు నయనతార కోసం మేకర్స్ సంప్రదిస్తున్నారట. వీరిద్దరూ గతంలో మెగాస్టార్ పక్కన ఆడి పాడారు. ఇప్పుడు మరోసారి ఈ స్టార్ హీరోయిన్లు చిరు తో కలిసి నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో హీరోకి సమానంగా మరో రెండు కీలకమైన పాత్రలు ఉంటాయి. వాటిలో ఎవరు నటిస్తారో చూడాలి.