Begin typing your search above and press return to search.

నాయకి తేలిపోయింది.. మరి త్రిష?

By:  Tupaki Desk   |   16 July 2016 11:00 PM IST
నాయకి తేలిపోయింది.. మరి త్రిష?
X
చెన్నై బ్యూటీ త్రిష కెరీర్ చివరి దశకు వచ్చేసిందని.. ఆఫర్లు అడుగంటేశాయని అనుకుంటున్న టైమ్ లో వచ్చిన సూపర్బ్ ఆఫర్ నాయకి. తన కెరీర్ లోనే తొలిసారి ఫిమేల్ లీడ్ ఇంపార్టెన్స్ ఉండే మూవీని చేసింది. ఇప్పుడా నాయకి థియేటర్లలోకి వచ్చింది కానీ.. ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. త్రిష చేసిన సీన్స్ బాగానే ఉన్నా.. భయపెట్టలేకపోయింది.

కేరక్టర్ రొటీన్ గా ఉండడంతో.. త్రిష పడ్డ కష్టానికి ఫలితం లేకపోయింది. ఈ ద్విభాషా చిత్రం తేలిపోవడంతో.. త్రిష కెరీర్ చివరికి వచ్చేసిందనే మాటలకు బలం చేకూరింది. అయితే.. ఇప్పటికిప్పుడు వచ్చి ప్రమాదం లేదు. ఇంకా ఒకటి రెండు అవకాశాలున్నాయి. మోహిని అంటూ ఇలాంటిదే మరో ప్రయత్నం చేస్తోంది త్రిష. ఇది కాక ధనుష్ మూవీ కోడిలో కూడా ఆఫర్ ఉంది. ఈ రెండింటితో పాటు బాలీవుడ్ క్వీన్ రీమేక్ లో హీరోయిన్ గా త్రిషనే అనుకుంటున్నారు.

ఇవన్నీ ఇప్పటికే ఫిక్స్ అయిన సినిమాలు కాగా.. కొత్త సినిమా ఆఫర్స్ రావడంలో మాత్రం ఆలోచించాల్సిందే. మరి వీటిలో ఏ సినిమా అయినా ఆకట్టుకుంటే కెరీర్ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే.. కోడి మినహా మిగిలిన రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీసే. అంటే ఇక హీరోల పక్కన హీరోయిన్ గా త్రిషకు ఛాన్సులు రావడం కష్టంగానే కనిపిస్తోంది.