Begin typing your search above and press return to search.
త్రిషని పనికిరావంటూ తేల్చేశారులే
By: Tupaki Desk | 15 Nov 2015 10:52 AM ISTఅందాల త్రిష దశాబ్ధం కెరీర్‌ని ముగించుకుని, తిరుగులేని కథానాయికగా ఇప్పటికీ బిజీ లైఫ్ ని కొనసాగిస్తోంది. కెరీర్ పరంగా ఎండింగే లేని స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకుంటోంది. లేటెస్టుగా ఈ భామ నటించిన చీకటిరాజ్యం మూవీ రిలీజ్ కి వస్తోంది. తెలుగులో ఈనెల 20 న రిలీజ్ కి వస్తోంది. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో ఒడిదుడుకుల్ని, అవహేళనల్ని ఓమారు గుర్తు చేసుకుంది త్రిష.
కెరీర్ ప్రారంభించినప్పుడు.. పరిశ్రమకు సంబంధం లేని కొందరు .. సన్నగా ఉన్నావ్.. పనికిరావని కామెంట్ చేశారు. పైగా మోడలింగ్ రంగం నుంచి వచ్చేవాళ్లు సినిమాలకు పనికిరారు అంటూ కామెంట్ చేశారు. కానీ ఆ రోజు వాటిని నేను పట్టించుకోలేదు. సన్నగా ఉన్నావ్.. కాస్త లావెక్కు అని సలహా ఇచ్చినవారికి ఒకటే నా సమాధానం. నేను మారను.. నేనింతే.. అని చెప్పాను. చెప్పిందే చేశాను. గెలుపు సొంతం చేసుకున్నా... అంటూ నాటి సంగతుల్ని ముచ్చటించింది.
ఇంత మొండి పిల్ల కాబట్టే అసలు తమిళమ్మాయిలు కథానాయికలుగా రాని రోజుల్లోనే అంత తెగువ చూపించింది. అంతమంది ముంబై హీరోయిన్ల మధ్య కూడా తను టాలీవుడ్ లో నెం.1 స్థానానికి ఎదిగింది. ఇలా ఎదగడానికి తెలుగు, తమిళ్ మీడియా ఎంకరేజ్ మెంట్ కూడా ఉందని ఏదో ఇప్పుడు కహానీలు చెబుతోంది కాని.. మీడియాదేముంది అమ్మీ.. నీ ఫిష్ టాటూలోనే ఉంది మాయాజాలం అంతా!!