Begin typing your search above and press return to search.

నాయకి స్వింగులోకి వచ్చింది

By:  Tupaki Desk   |   28 Aug 2015 4:09 AM GMT
నాయకి స్వింగులోకి వచ్చింది
X
క్యూట్‌ త్రిష కెరీర్‌ ఆద్యంతం రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ లతోనే ఎక్కువగా నెట్టుకొచ్చింది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాల్లో త్రిష నటనకు 200 పర్సంట్‌ మార్కులు వేశారు మన తెలుగు ప్రేక్షకులు. అలాంటి త్రిష ఉన్నట్టుండి ఓ హారర్‌ థ్రిల్లర్‌ లో కనిపిస్తే డైజెస్ట్‌ చేసుకోగలరా? టెస్టింగ్‌ టైమ్‌ ఇది. కాంచన, గీతాంజలి, చంద్రకళ తరహా చిత్రంలో నటిస్తోంది ఈ చెన్నయ్‌ చంద్రం. ప్రస్తుతం ఈ సినిమా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌.

బాలయ్యబాబు సరసన లయన్‌ చిత్రంలో నటించింది. ఇదో యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌. లవ్‌, యాక్షన్‌, ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉన్న సినిమాల్లోనే ఇంతకాలం నటించింది... కాబట్టి ఇక త్రిష కొత్త రూటులో వెళ్లాలనుకుని 'నాయకి' చిత్రంతో ఓ ప్రయోగం చేస్తోంది. ఈ సినిమా ఓ హారర్‌ థ్రిల్లర్‌. గోవి దర్శకత్వం వహిస్తున్నాడు. గిరిధర్‌ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం స్వింగులో ఉంది. హిస్టారికల్‌ ప్లేస్‌ మహాబలేశ్వరంలో తెరకెక్కిస్తున్నారు. తెలుగువారంతా ఎంతో పవిత్రంగా భావించే ఈ చోట షూటింగ్‌ త్రిష కెరీర్‌ కి సెంటిమెంటుగా కలిసొస్తుందేమో చూడాలి.